Adipurush : ఇక్కడి నుంచి ప్రభాస్.. అక్కడి నుంచి కృతి..
టీ సిరీస్ సంస్థ పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆదిపురుష్’ సినిమాను నిర్మిస్తోంది.. 2022 ఆగస్టు 11న విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు..

Adipurush
Adipurush: ‘బాహుబలి’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రెబల్‌స్టార్ ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు. ‘రాధే శ్యామ్’ 2022 సంక్రాంతికి రిలీజ్‌కి రెడీ అవుతుండగా.. మరోవైపు‘సలార్’ షూటింగ్ కొంత వరకు కంప్లీట్ చేశారు. ఇటీవలే నాగ్ అశ్విన్‌తో చేస్తున్న మూవీ షూటింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయింది.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ ఈ సినిమాతో హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్.. రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. ‘ఆదిపురుష్’ షూటింగ్ బాంబేలో ప్రారంభమైంది. షూట్‌లో జాయిన్ అవడానికి హైదరాబాద్ నుండి ప్రభాస్ ముంబై వెళ్లారు.
Prabhas : ‘డార్లింగ్, మనోళ్లు ఎక్స్‌ట్రా ఇస్తామంటున్నారు’.. అదీ ప్రభాస్ గొప్పదనం
అలాగే హీరోయిన్ కృతి సనన్ కూడా ఢిల్లీ నుండి షూటింగ్ స్పాట్‌కి చేరుకున్నారు. ఈ మూవీలో ఆమె సీత క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. టీ సిరీస్ సంస్థ పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆదిపురుష్’ సినిమాను నిర్మిస్తోంది. 2022 ఆగస్టు 11న విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు.
Prabhas : ‘ప్రాజెక్ట్ – కె’.. టైటిల్ అందులోనే ఉందంటగా..!