Mansoor Ali Khan : త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీఖాన్.. కానీ ఎలా చెప్పాడో తెలుసా?

మన్సూర్ అలీఖాన్ ఎట్టకేలకు దిగి వచ్చారు. త్రిషపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే క్షమాపణలు చెప్పడంలోనూ తనదైన స్టైల్ చూపించారు. ఇక ఈ ఎపిసోడ్‌కి ముగింపు పలికినట్లేనా?

Mansoor Ali Khan

Mansoor Ali Khan : నటుడు మన్సూర్ అలీఖాన్ నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కున్నారు. తను ఏ తప్పు చేయలేదని సమర్ధించుకున్న మన్సూర్ అలీఖాన్ త్రిషకు సారీ చెప్పేది లేదని అన్నారు. ఈ వివాదంతో మన్సూర్ అలీఖాన్‌పై కేసు నమోదైంది. ఇక పరిస్థితి చేయి దాటిపోతుందనుకున్నారేమో ఎట్టకేలకు దిగి వచ్చి త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు మన్సూర్ అలీఖాన్.

Ranbir Kapoor : ప్రభాస్ అన్న సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినా చేస్తాను.. రణబీర్ రిక్వెస్ట్..

తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేప్ సీన్స్ గురించి మాట్లాడారు. చాలామంది హీరోయిన్స్‌తో రేప్ సీన్‌లో నటించానని ‘లియో’ సినిమాలో త్రిషతో కూడా రేప్ సీన్ ఉంటుందని అనుకున్నానని, కానీ లేనందుకు బాధపడ్డానంటూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. మన్సూర్ వ్యాఖ్యలను చిరంజీవి, లోకేష్ కనగరాజ్, మాళవిక మోహనన్, డైరెక్టర్ కార్టీక్ సుబ్బరాజు, చిన్మయి, నితిన్ వంటివారు తీవ్రంగా ఖండించారు. అతడిని బ్యాన్ చేయాలని, అరెస్ట్ చేయాలని సోషల్ మీడియాలో అనేకమంది డిమాండ్ చేసారు.

మన్సూర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన త్రిష ఇకపై అతనితో కలిసి నటించేది లేదని స్పష్టం చేశారు. దానిపై వివరణ ఇచ్చిన మన్సూర్ తన ఇంటర్వ్యూ మొత్తం చూడకుండా మాట్లాడుతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తనకు కూడా కూతురు ఉందని, ఫ్యామిలీ ఉందని దీనిని కొందరు కావాలని పెద్ద ఇష్యూ చేస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. కాగా దక్షిణ భారత నటీనటుల సంఘం ఆయనని హెచ్చరిస్తూ నోటీసులు పంపింది. త్రిషకు సమాధానం చెప్పాలని కోరింది. దీనికి మన్సూర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తను ఏ తప్పూ చేయలేదని త్రిషకు క్షమాపణలు చెప్పనని స్పష్టం చేశారు. అంతేకాదు ఆమెపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు.

Meetha Raghunath : పెళ్లి చేసుకోబోతున్న ‘గుడ్ నైట్’ హీరోయిన్.. నిశ్చితార్థం ఫోటోలు వైరల్

ఇదిలా ఉంటే మన్సూర్ అలీఖాన్‌పై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మన్సూర్‌పై నోటీసులు జారీ అయ్యాయి. ముందస్తు బెయిల్ కోసం మన్సూర్ అలీఖాన్ చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో పిటిషన్ కూడా వేసారు. నవంబర్ 24 న విచారణకు హాజరు కావాల్సి ఉండగా మన్సూర్ అలీఖాన్ దిగివచ్చి త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తను కత్తి లేకుండా వారం పాటు యుద్ధం చేసానని.. ఈ యుద్ధంలో ఎటువంటి రక్తపాతం లేకుండా గెలిచానని తన వ్యాఖ్యలతో త్రిషకు బాధ కలిగించిందుకు క్షమాపణలు కోరుతున్నా అంటూ మన్సూర్ అలీఖాన్ మీడియాలో ప్రకటన ద్వారా త్రిషకు సారీ చెప్పారు. ఈ నోట్‌ను ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు .  దీనిపై తాజాగా ‘తప్పు చేయడం మానవత్వం, క్షమించడం దైవం అంటూ’ త్రిష పెట్టిన ట్వీట్‌తో ఈ వివాదానికి తెరపడినట్లుగా అంతా భావిస్తున్నారు.