Meetha Raghunath : పెళ్లి చేసుకోబోతున్న ‘గుడ్ నైట్’ హీరోయిన్.. నిశ్చితార్థం ఫోటోలు వైరల్
చాలా తక్కువ టైమ్‌లో మంచి పేరు సంపాదించుకున్న నటి.. యూత్‌లో ఎంతో క్రేజ్ ఉన్న నటి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఎవరా నటి?

Meetha Raghunath
Meetha Raghunath : ‘గుడ్ నైట్’ సినిమాలోని నటనతో యూత్ మనసులు కొల్లగొట్టిన తమిళ యంగ్ హీరోయిన్ మీతా రఘునాథ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కోలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో ఆమె నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Meetha Raghunath
చేసినవి కొన్ని సినిమాలే అయినా మీతా రఘునాథ్‌కి పాపులారిటీ మామూలుగా ఉండదు. తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకున్నారామె. భాషతో సంబంధం లేకుండా వచ్చిన చిన్న సినిమా ‘గుడ్ నైట్’ లో కె.మణికంఠన్‌కి జోడీగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ‘అను’ పాత్రలో ఎటువంటి మేకప్ లేకుండా నటించి మెప్పించారు. నిద్ర, గురక వంటి చిన్న విషయాలు కథా వస్తువులుగా లో బడ్జెట్‌లో వచ్చిన గుడ్ నైట్ సినిమా భాషతో సంబంధం లేకుండా అందరినీ అలరించింది. భర్త కోసం ఏదైనా భరించే పాత్రలో మీతా రఘునాథ్ ఒదిగిపోయారు అని చెప్పాలి.

Meetha Raghunath 2
Álso Read : చిరిగిన బూట్లతో సల్మాన్ ఖాన్.. సింప్లిసిటీని మెచ్చుకుంటున్న ఫ్యాన్స్
2002 లో ‘ సా నీ నిధూమ్’ సినిమాతో మీతా రఘునాథ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. గుడ్ నైట్ మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత భారీ ఆఫర్లు వస్తున్న తరుణంలో మీతా రఘునాథ్ తన పెళ్లి వార్తను ప్రకటించారు. తాజాగా మీతా నిశ్చితార్ధం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబోయే భర్తతో ఉన్న ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసారు. కాబోయే భర్త వివరాలతో పాటు పెళ్లి తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. యూత్ కలల రాణిగా చాలా తక్కువ టైమ్‌లో తన నటనతో పేరు తెచ్చుకున్న మీతా రఘునాథ్‌కి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Also Read: లంగావోణి అందాలతో మెస్మరైజ్ చేస్తున్న దివి..