Mass Jathara pre release event : ర‌వితేజ కోసం గ‌జినీ.. మాస్ జాత‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎప్పుడంటే..?

మాస్ జాత‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు (Mass Jathara pre release event) అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

Mass Jathara pre release event : ర‌వితేజ కోసం గ‌జినీ.. మాస్ జాత‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎప్పుడంటే..?

Mass Jathara pre release event on october 28th

Updated On : October 27, 2025 / 11:52 AM IST

Mass Jathara pre release event : మాస్ మహారాజా రవితేజ (Raviteja) న‌టిస్తున్న చిత్రం మాస్ జాత‌ర‌. భాను భోగవరపు దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. శ్రీలీల క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 31న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా హైద‌రాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు స‌న్నాహ‌కాలు చేస్తోంది. అక్టోబ‌ర్ 28 (మంగ‌ళ‌వారం) హైద‌రాబాద్‌లోని జేఆర్సీ క‌న్వెన్ష‌న్స్‌లో ఈవెంట్‌ను నిర్వ‌హించనున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హాజ‌రుకానున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

Chiranjeevi : డీప్‌ ఫేక్‌ బారిన చిరు.. కేసు న‌మోదు

ధ‌మాకా త‌రువాత ర‌వితేజ‌, శ్రీలీల న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో ఈ మూవీ ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇటీవ‌లే ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ స‌ర్టిఫికేట్‌ను సెన్సార్ బోర్డు ఇచ్చింది. ఈ చిత్ర నిడివి 160 నిమిషాలుగా తెలుస్తోంది.