Eagle Collections : రవితేజ ‘ఈగల్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈగల్ సినిమా. మాస్ మహారాజ యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసాడని, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవల్ అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా పొగిడేస్తున్నారు.

Mass Maharaja Raviteja Eagle Movie first Day Collections
Eagle Collections : మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన యాక్షన్ సినిమా ‘ఈగల్’ నిన్న ఫిబ్రవరి 9న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది. ఈగల్ లో కావ్య థాపర్(Kavya Thapar) హీరోయిన్ గా నటించగా, అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధుబాల.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో గ్రాండ్ గా స్టైలిష్ మాస్ యాక్షన్ సినిమాలా తెరకెక్కింది ఈగల్.
మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈగల్ సినిమా. మాస్ మహారాజ యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసాడని, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవల్ అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా పొగిడేస్తున్నారు. ఇక ఈగల్ సినిమా మొదటి రోజు 12 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం. అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించకపోయినా సోషల్ మీడియాలో పలువురు సినీ ట్రేడర్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈగల్ సినిమా మొదటి రోజు 12 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. అంటే దాదాపు 6 కోట్ల షేర్ వచ్చింది.
Also Read : They Call Him OG : పవన్ OG కోసం సీరియస్ డిస్కషన్స్ లో థమన్, సుజీత్.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోవాలి..
ఇక నేడు, రేపు వీకెండ్ కావడం, పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం ఈగల్ కి మరింత కలిసి వస్తుంది. ఈజీగా మూడు రోజుల్లో 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. ఇక ఈగల్ సినిమా 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. దీంతో మూడు రోజుల్లోనే ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని అంచనా వేస్తున్నారు. మరి మాస్ మహారాజ ఈగల్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో చూడాలి.