Raviteja : రవితేజ హారర్ సినిమా చేస్తాడా..? అది కూడా ఆ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తో.. ఈ సారి అయినా హిట్టు కొట్టు బాబు..
తాజాగా రవితేజ నెక్స్ట్ సినిమాపై ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. (Raviteja)
Raviteja
- రవితేజ నెక్స్ట్ సినిమా అప్డేట్
- స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ డైరెక్టర్ తో
- ఈసారి అయినా హిట్ కొడతాడా రవితేజ
Raviteja : కష్టపడి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మాస్ మహారాజా గా ఎదిగిన హీరో రవితేజ. ఎన్నో హిట్స్ చుసిన రవితేజ గత కొంతకాలంగా మాత్రం వరుస ఫ్లాప్స్ చూస్తున్నారు. ఇటీవల రిలీజయిన మాస్ జాతర కూడా ఫ్లాప్ గానే మిగిలింది. దీంతో ఫ్యాన్స్ సైతం రవితేజ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్క్రిప్ట్, హీరోయిన్స్ సెలక్షన్ విషయంలో ఎక్కువగా మైనస్ అవుతుందని అంటున్నారు.(Raviteja)
త్వరలో సంక్రాంతికి రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో వస్తున్నాడు. ఒకవేళ ఈ సినిమా అటూ ఇటు అయినా సంక్రాంతి టైం కాబట్టి సేఫ్ అయిపోతాడు అని భావిస్తున్నారు. అందుకే రవితేజ ఫ్యామిలీ సినిమాని పట్టుబట్టి మరీ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాడు.
Also Read : Sai Pallavi : సాయి పల్లవి సినిమా రిలీజ్ ఆపేసిన అమీర్ ఖాన్.. ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాలి..
అయితే తాజాగా రవితేజ నెక్స్ట్ సినిమాపై ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో రవితేజ సినిమా చేయనున్నాడట. అంటే సుందరానికి, బ్రోచేవారెవరురా, సరిపోదా శనివారం, మెంటల్ మదిలో లాంటి మంచి సినిమాలు తీసిన డైరెక్టర్, స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ వివేక్ ఆత్రేయతో సినిమా అనగానే ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
వివేక్ ఆత్రేయ రవితేజకు ఒక హారర్ సినిమా కథ చెప్పాడట. రవితేజకు కూడా ఆ పాయింట్ నచ్చింది. ప్రస్తుతం ఫైనల్ డిస్కషన్స్ లో ఉన్నారట. ఇంకొన్ని మార్పులు చేర్పులు చేసి వివేక్ రవితేజకు ఫైనల్ నేరేషన్ ఇస్తే రవితేజతో ఈ సినిమా ఓకే అయిపోతుందని టాలీవుడ్ టాక్.
Also Read : Malavika Mohanan : ప్రభాస్ సినిమా పోయిందని బాధపడ్డా.. నన్నూ ప్రభాస్ ను కలిపింది అదే..
మరి నిజంగానే రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమా ఓకే అవుతుందా? రవితేజ మొదటిసారి హారర్ సినిమా చేస్తాడా చూడాలి. ఫ్యాన్స్ అయితే డైరెక్టర్ మీద నమ్మకంతో ఈ సినిమా ఓకే అవ్వాలని కోరుకుంటున్నారు. ఓకే చేస్తే మాత్రం ఈ సినిమాతో అయినా మాస్ మహారాజ హిట్టు కొడతాడు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
