Avantika Vandanapu : హాలీవుడ్‌లో సూపర్ హిట్.. అయినా షాప్‌లో పని చేస్తున్న తెలుగు సెన్సేషన్ అవంతిక..
హాలీవుడ్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న తెలుగు అమ్మాయి అవంతిక.. సింపుల్ గా ఓ ఫుడ్ రెస్టారెంట్ షాప్ లో పని చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Mean Girls star Avantika Vandanapu working at food restaurants video gone viral
Avantika Vandanapu : అప్పుడెప్పుడో మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి సినీ రంగంలో కెరీర్ స్టార్ట్ చేసిన తెలుగు అమ్మాయి ‘అవంతిక వందనపు’. ఆ తరువాత కృష్ణగాడి వీర ప్రేమ గాధ, ప్రేమమ్, అజ్ఞాతవాసి, రారండోయ్ వేడుక చూద్దాం.. సినిమాల్లో నటించిన అవంతిక మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు. అయితే ఇటీవల సడన్ గా ఈమె పేరు హాలీవుడ్ లో కొంచెం గట్టిగా వినిపించడంతో టాలీవుడ్ అవంతిక పేరు మారుమోగిపోయింది.
అవంతిక నటించిన హాలీవుడ్ సినిమా ‘మీన్ గర్ల్స్’ సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ మూవీలో అవంతిక పోషించిన పాత్ర మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఈ సినిమాకి ముందు అవంతిక పలు హోలీవడ్ సినిమా అండ్ సిరీస్ లో నటించింది. కానీ ఈ ‘మీన్ గర్ల్స్’ తో మంచి గుర్తింపుని అందుకుంది. ఇక ఇంత సక్సెస్ అందుకున్న తరువాత కూడా అవంతిక ఓ ఫుడ్ రెస్టారెంట్ షాప్ లో పని చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also read : Shah Rukh Khan : ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించే పనిలో షారుఖ్.. డిఫరెంట్ జోనర్స్‌తో..
అక్కడ వచ్చిన కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ తీసుకోని, వారికీ ఫుడ్ సర్వ్ చేస్తుంది. ఆ వీడియో చూస్తుంటే అవంతిక గతంలో అక్కడ వర్క్ చేసినట్లు అనిపిస్తుంది. సినిమా సక్సెస్ అయ్యి అవంతిక మంచి ఫేమ్ రావడంతో.. ఆ షాప్ వారు ఆమెకు గ్రాండ్ వెల్కమ్ పలికి, అవంతిక సంబంధించిన విషయాలను వీడియో చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇదే వీడియోలో అవంతిక.. ‘మీన్ గర్ల్స్’ మూవీ యూనిట్ కి సంబంధించిన వ్యక్తితో కూడా మాట్లాడింది.
ఆ వీడియోలో అవంతిక మాట్లాడుతూ.. “మీరు ఇచ్చిన విజయాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు నా మీద ప్రేమ చూపిస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక దీనికి మూవీ టీం వ్యక్తి బదులిస్తూ.. “నువ్వు రైజింగ్ స్టార్‌వి. నీకు ఇంకా పెద్ద స్థాయికి ఎదగడం నేను చూస్తాను” అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియోని తెలుగు ఆడియన్స్ వైరల్ చేస్తున్నారు.
View this post on Instagram