Meenakshi Chaudhary : మరో బంపర్ ఆఫర్ అందుకున్న మీనాక్షి చౌదరి.. విజయ్‌తో సినిమా నిజమేనా..?
టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి మరో బంపర్ ఆఫర్ అందుకుందట. తమిళ్ స్టార్ హీరో విజయ్..

Meenakshi Chaudhary got chance in vijay Thalapathy68
Meenakshi Chaudhary : ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన మీనాక్షి చౌదరి వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ వైపు అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఈ భామ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాలో నటిస్తుంది. అలాగే విశ్వక్ సేన్, వరుణ్ తేజ్ సినిమాల్లో కూడా అవకాశం అందుకుంది. ఇటీవల దుల్కర్ సల్మాన్ నటించబోయే ‘లక్కీ భాస్కర్’లో కూడా హీరోయిన్ గా ఛాన్స్ అందుకొని మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది.
Shruti Haasan : రిలీజ్‌కి ముందే ఇంటర్నేషనల్ అవార్డుల నామినేషన్‌లో శృతిహాసన్ మూవీ..
తాజాగా ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. విజయ్ తన 68వ మూవీని వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షిని ఫైనల్ చేశారట. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంచ్ కానుందని సమాచారం. అప్పుడే మీనాక్షిని కూడా ఆడియన్స్ కి పరిచయం చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఏజిఎస్ సినిమాస్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది.
Hi Nanna : నాని ‘హాయ్ నాన్న’ అంటూ అక్టోబర్‌లోనే పలకరించబోతున్నాడా.. పోస్ట్ వైరల్..!
మీనాక్షి చేతిలో ప్రస్తుతం మొత్తం మీద 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ చిత్రాలు అన్ని కూడా వచ్చే ఏడాదిలోనే ఉండబోతున్నాయి. దీంతో నెక్స్ట్ ఇయర్ హీరోయిన్స్ లో మీనాక్షిది ఫుల్ డామినేషన్ ఉండబోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల అరడజనకు పైగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ స్వింగ్ లో ఉంది. రానున్న రోజుల్లో మీనాక్షి శ్రీలీలకు గట్టిపోటీ ఇవ్వబోతుందని తెలుస్తుంది. కాగా వీరిద్దరూ గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకి జోడిగా కనిపించబోతున్నారు. మీనాక్షి నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చే మొదట వచ్చే సినిమా ఇదే కావడం విశేషం.