మీరాచోప్రా ఆర్డర్ చేసిన ఫుడ్ లో ఏం వచ్చిందో తెలుసా?

  • Published By: veegamteam ,Published On : August 24, 2019 / 09:26 AM IST
మీరాచోప్రా ఆర్డర్ చేసిన ఫుడ్ లో ఏం వచ్చిందో తెలుసా?

Updated On : August 24, 2019 / 9:26 AM IST

లగ్జరీ హోటల్ అనగానే మన మైండ్‌లో ఏదేదో ఊహించుకుంటాం. వాటిలో ఫుడ్ చాలా క్వాలీటీగా ఉంటుందని అనుకుంటాం. కానీ ప్రముఖ నటీకి లగ్జరీ హోటల్ లో ఎదురైన విషయం తెలిస్తే షాక్ అవుతారు.  

విషయం ఏంటంటే.. బాలీవుడ్ నటి మీరా చోప్రా బ్రేక్ ఫాస్ట్ కోసం అహ్మదాబాద్‌లోని ఓ లగ్జరీ హోటల్‌కి వెళ్లింది. ఫుడ్ రాగానే వేడివేడిగా తిందామని ప్లేట్ చూడగానే.. అందులోంచి తెల్లటి పురుగులు బయటకు వచ్చాయి. అవి ప్లేట్ లో అటూ ఇటూ పాకడం చూసి మీరా చోప్రా షాక్ అయింది. ఇదేంటి లగ్జరీ హోటల్ లో ఫుడ్ కూడా ఇంత దారుణంగా ఉంటుందా.. అని వెంటనే ఆ ప్లేట్ లో పాకుతున్న పురుగును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  

దీనిపై మీరా చోప్రా మాట్లాడుతూ.. తాను ఉంటున్నది డబుల్ ట్రీ హెల్టన్ హోటల్ అని తెలిపింది. ఇలాంటి హోటళ్లలో ఉండేందుకు చాలా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. అంత చెల్లిస్తున్నా ఇలాంటి పురుగులతో ఆహారం ఇస్తున్నారని ట్విట్టర్‌లో ఫైర్ అయ్యింది. ఈ వీడియోని వైరల్ చేసి అందరూ అలర్ట్ అయ్యేలా చెయ్యాలని కోరింది.