Meera Mitun: అరెస్ట్ చేశారో కత్తితో పొడుచుకు చస్తా.. నటి బెదిరింపులు
తమిళ బిగ్ బాస్ తో పాపులారిటీ దక్కించుకున్న మీరా మిథున్.. సినీ పరిశ్రమలోని షెడ్యూల్డు కులానికి చెందిన డైరక్టర్లు, యాక్టర్లు, ఇతర నిపుణులు అందరూ బయటకు వ

Meera Mitun (1)
Meera Mitun: తమిళ బిగ్ బాస్ తో పాపులారిటీ దక్కించుకున్న మీరా మిథున్.. సినీ పరిశ్రమలోని షెడ్యూల్డు కులానికి చెందిన డైరక్టర్లు, యాక్టర్లు, ఇతర నిపుణులు అందరూ బయటకు వెళ్ళిపోవాలని.. వారి పద్ధతి, వ్యవహారాలు బాగుండవని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చెన్నై, కోయంబత్తూరు, ఈరోడ్ సహా ఏడు జిల్లాలో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు కాగా ఆమె మాట్లాడిన వీడియో ఆధారంగా తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీస్ కేసులపై వివరణ ఇచ్చే క్రమంలో మీరా మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. పోలీసులు తనను అరెస్ట్ చేయలేరని.. కలలో మాత్రమే అది జరుగుతుందని.. సాధ్యమైతే అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు సవాల్ విసురుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేరళలో తలదాచుకున్న ఆమెను శనివారం అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొనే క్రమంలో పెద్దగా పెద్దగా అరుస్తూ రచ్చ రచ్చ చేస్తూ వీడియో తీస్తూ మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో మీరా మిథున్ చేసిన రచ్చ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేదా.. పోలీసులు చార్చర్ చేస్తున్నారు. ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించండి అంటూ అరుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పోలీసులు నన్ను ముట్టుకుంటే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరించింది. ఇది సీఎం, ప్రధాని, తమిళనాడు పోలీసులు చేస్తున్న హింస అంటూ వీడియోలో అరుస్తూ, ఏడుస్తూ బెదిరింపులకు దిగింది.