Mega 154: మెగా 154.. బాస్ వస్తుండు.. టైటిల్ తెస్తుండు!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 154 మూవీ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను అక్టోబర్ 24న ఉదయం 11.07 గంటలకు దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.

Mega 154: మెగా 154.. బాస్ వస్తుండు.. టైటిల్ తెస్తుండు!

Mega 154 Title Teaser Official Date Time Locked

Updated On : October 20, 2022 / 8:45 PM IST

Mega 154: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 154 మూవీ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో చిరు ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా చూస్తున్నారు.

Mega154: డబ్బింగ్ పనులు మొదలుపెట్టిన మెగా 154!

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుండగా, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను రివీల్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను అక్టోబర్ 24న ఉదయం 11.07 గంటలకు దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. చిరు ముఖాన్ని సగం చూపిస్తూ ఈ సినిమాపై మరింత అంచనాలు క్రియేట్ చేసింది చిత్ర యూనిట్. ఈ లుక్ మెగాస్టార్ గతంలో నటించిన ‘ముఠామేస్త్రీ’ తరహా లుక్‌లా ఉందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Mega154: దీపావళి బాంబ్‌ను రెడీ చేస్తోన్న మెగాస్టార్..?

మొత్తానికి ప్రీలుక్‌తోనే ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మాస్ రాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.