Mega154: దీపావళి బాంబ్‌ను రెడీ చేస్తోన్న మెగాస్టార్..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. చిరు నటిస్తున్న 154వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసేందుకు రెడీ అవుతోందట. ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్డేట్‌ను చిత్ర యూనిట్ దీపావళి కానుకగా తీసుకొస్తున్నారట.

Mega154: దీపావళి బాంబ్‌ను రెడీ చేస్తోన్న మెగాస్టార్..?

Mega154: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించగా, ఈ సినిమాను చూసేందుకు మెగా ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక దసరా కానుకగా ఈ సినిమాతో మనముందుకు వచ్చిన చిరు, దీపావళి బాంబ్‌ను కూడా రెడీ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Mega154: “మెగా154″ను భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్‭ఫ్లిక్స్‭!

చిరు నటిస్తున్న 154వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసేందుకు రెడీ అవుతోందట. అయితే ఈ సినిమా నుండి ఇటీవల ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్డేట్‌ను చిత్ర యూనిట్ దీపావళి కానుకగా తీసుకొస్తున్నారట.

Mega154: భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కబోతున్న మెగా 154.. ఫ్యాన్స్ కి కిక్కిస్తున్న తాజా న్యూస్!

మెగా 154 ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ దీపావళి నాడు రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో చిరు కనిపించనున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక దీపావళికి చిరు మెగా బాంబ్‌ను పేల్చనున్నాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ కావడంతో, అభిమానులు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.