Mega154: భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కబోతున్న మెగా 154.. ఫ్యాన్స్ కి కిక్కిస్తున్న తాజా న్యూస్!

మెగా 154, వాల్టెయిర్ వీరయ్య అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Mega154: భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కబోతున్న మెగా 154.. ఫ్యాన్స్ కి కిక్కిస్తున్న తాజా న్యూస్!

Mega154 Takes Turn into Big Multi Starrer

Mega154: మెగా 154, వాల్టెయిర్ వీరయ్య అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Mega154: మెగాస్టార్‌ మూవీలో విక్టరీ వెంకటేష్.. నిజమెంత?

కాగా ఇటీవలే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక చిన్న పాత్రలో మెరవబోతున్నట్లు వార్తలు వినిపించగా, ఇప్పుడు టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఈ సినిమాలో మెరవబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వెంకటేష్ కి సంబంధించిన సీక్వెన్స్‌ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకప్పటి స్టార్ హీరోస్ అందరిని ఇలా ఒకే స్క్రీన్ మీద చూడడానికి ఆడియన్స్ కూడా.. ఆ వార్తలు నిజమైతే బాగుండు అని అనుకుంటున్నారు. మరి ప్రేక్షకుల ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో వేచి చూడాల్సిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాతంకంగా ఈ చిత్రాని నిర్మిస్తుంది.