Mega154: మెగాస్టార్‌ మూవీలో విక్టరీ వెంకటేష్.. నిజమెంత?

Mega154 వర్కింగ్ టైటిల్ తో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసందే. కాగా ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక వార్త సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో...

Mega154: మెగాస్టార్‌ మూవీలో విక్టరీ వెంకటేష్.. నిజమెంత?

Venkatesh guest Appearance in Mega154

Mega154:  Mega154 వర్కింగ్ టైటిల్ తో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి “వాల్తేర్‌ వీరయ్య” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి తన ‘గాడ్ ఫాదర్’ మూవీ విడుదలకు సిద్ధం కావడంతో బాబీ మూవీ పట్టాలెక్కించి పూర్తి చేసే పనిలో పడ్డాడు.

Chiranjeevi: Mega154 సెట్ లో కృష్ణంరాజుకు నివాళులు..

మెగాస్టార్ కి జంటగా శ్రుతి హాసన్ నటిస్తుండగా, టాలీవుడ్ మాస్ మహారాజ్ ‘రవితేజ’ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు మూవీ మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. అవుట్ అండ్ అవుట్ మాస్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక వార్త సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో అతిధి పాత్రతో మెరవబోతున్నాడట.

ఒక చిన్న సరదా సందర్భంలో వెంకటేష్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. కామెడీ టైమింగ్ లో ఈ ఇద్దరి స్టార్స్ కి అసలు తిరుగు లేదు. అలాంటిది ఒకేసారి వీరిద్దరూ కలిసి కామెడీ చేయబోతున్నారంటే థియేటర్ లో నవ్వుల పండుగే అని చెప్పాలి. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఆగాల్సిందే. ఇక ఈ మూవీ కొత్త షెడ్యూల్ నేటి నుంచి మొదలు పెట్టుకుంది.