NTR : మెగా – నందమూరి ఫ్యామిలీలు అంతా గన్నవరం వెళ్తే.. ఎన్టీఆర్ మాత్రం హైదరాబాద్‌కు..
మెగా, నందమూరి ఫ్యామిలీలు అంతా ప్రమాణ స్వీకారానికి గన్నవరం వెళ్తే ఎన్టీఆర్ మాత్రం హైదరాబాద్ వచ్చారు.

Mega and Nandamuri Families Attend to Taking Oath Ceremony but NTR in Hyderabad
NTR : నిన్న ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం గన్నవరంలో ఘనంగా అజరిగింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అనేకమంది ప్రతినిధులు హాజరయ్యారు. సినీ పరిశ్రమ నుంచి కూడా చాలా మంది హాజరయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం, బాలకృష్ణ మూడో సారి ఎమ్మెల్యేగా గెలవడంతో నందమూరి కుటుంబ సభ్యులు కూడా అందరూ వచ్చారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మంత్రి అవ్వడం, చిరంజీవిని స్టేట్ గెస్ట్ గా పిలవడంతో మెగా ఫ్యామిలీ కూడా అందరూ వచ్చారు.
ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మెగా, నందమూరి కుటుంబాల కలయిక చూడముచ్చటగా ఉంది. మెగా, నందమూరి ఫ్యామిలీ ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రాలేదు. వీరికి ఆహ్వానం లేదని కొందరు అంటుండగా, నందమూరి ఫ్యామిలీ అంతా వెళ్లారు కదా అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
Also Read : Mega Cousins : మెగా కజిన్స్‌తో పవర్ మూమెంట్.. పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేసిన మెగా కజిన్స్..
అయితే నిన్న మెగా, నందమూరి ఫ్యామిలీలు అంతా ప్రమాణ స్వీకారానికి గన్నవరం వెళ్తే ఎన్టీఆర్ మాత్రం హైదరాబాద్ వచ్చారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. గోవాలో షూటింగ్ షెడ్యూల్ ముగించుకొని నిన్న సాయంత్రం ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చారు. గత రెండు రోజుల నుంచి ఈ విషయంలో ఎన్టీఆర్ చర్చగా మారారు. సడెన్ గా ప్రమాణ స్వీకారం రోజే ఎన్టీఆర్ హైదరాబాద్ కి రావడంతో మరోసారి ఎన్టీఆర్ గురించి, ఎన్టీఆర్ ఎందుకు ప్రమాణ స్వీకారానికి వెళ్ళలేదు అంటూ చర్చించుకుంటున్నారు.