Mega Cousins : మెగా కజిన్స్‌తో పవర్ మూమెంట్.. పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేసిన మెగా కజిన్స్..
మెగా కజిన్స్ అంతా కలిసి పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో వైరల్ గా మారింది.

Mega Family Cousins take a Photo with Pawan Kalyan
Mega Cousins – Pawan Kalyan : నిన్న ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో మెగా ఫ్యామిలీ అంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అనేక ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. పవన్ ప్రమాణ స్వీకారాన్ని మెగా ఫ్యామిలీ అంతా చూసి ఆనందంలో మునిగిపోయారు. ఇక పవన్ ఏపీ మంత్రిగా ప్రమాణం చేయడంతో మెగా కుటుంబ సభ్యులు అంతా మరోసారి సోషల్ మీడియాలో పవన్ పై తమ ప్రేమను చూపిస్తూ పలు ఫోటోలు షేర్ చేస్తూ పోస్టులు చేస్తూ పవన్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు.
రామ్ చరణ్, ఉపాసన, సాయి ధరమ్ తేజ్, సుష్మిత, నిహారిక.. ఇలా అందరూ సోషల్ మీడియాలో పవన్ కి కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు చేసారు. అలాగే ఈ మెగా కజిన్స్ అంతా కలిసి పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్, పవన్ భార్య అన్నా లెజనోవా, సాయి ధరమ్ తేజ్, సుష్మిత, సుస్మిత కూతురు, నిహారిక, శ్రీజ, శ్రీజ కూతుళ్లు ఉన్నారు. పవర్ స్టార్ తో మెగా కజిన్స్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇలా మెగా కజిన్స్ అంతా ఒకే చోట చేరడం. పవన్ కి శుభాకాంక్షలు తెలపడంతో మెగా అభిమానులు సంతోషిస్తున్నారు. ఇక నిన్న స్టేజిపై పవన్, చిరులను మోడీ దగ్గరకు తీసుకోవడం, పవన్ చిరంజీవి కాళ్లకు నమస్కరించడం, చిరంజీవి సంతోషంతో పొంగిపోవడం.. ఇలా మెగా ఫ్యాన్స్ కి నిన్నటి నుంచి ఫుల్ హ్యాపీ మూమెంట్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు.
Hearty congratulations to @ncbn Garu on this historic victory, it was indeed a pleasure to celebrate alongside Honourable PM @narendramodi Ji & Dr. @KChiruTweets Garu.
Kudos to @PawanKalyan Garu ?? Your dedication & hard work have truly paid off. The people of Andhra Pradesh & I… pic.twitter.com/rCim2xDmkl— Ram Charan (@AlwaysRamCharan) June 13, 2024