Klin Kaara – Pawan Kalyan : క్లిన్ కారాతో పవన్ కళ్యాణ్ క్యూట్ ఫోటో చూశారా.. ప్రమాణ స్వీకారం వేళ లీక్ చేసిన ఉపాసన..
రామ్ చరణ్ భార్య ఉపాసన ఓ క్యూట్ ఫోటో షేర్ చేసింది.

Upasana Shares Pawan Kalyan and Klin Kaaraa Cute Photo in Social Media
Klin Kaara – Pawan Kalyan : గన్నవరంలో ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో మెగా ఫ్యామిలీ అంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మెగా కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. మెగా ఫ్యామిలీ అందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు. పవన్ ఏపీ మంత్రిగా ప్రమాణం చేయడంతో మెగా కుటుంబ సభ్యులు అంతా మరోసారి సోషల్ మీడియాలో పవన్ పై తమ ప్రేమను చూపిస్తూ పలు ఫోటోలు షేర్ చేస్తూ పోస్టులు చేసారు.
Also Read : Lavanya Tripathi : పవన్ ప్రమాణ స్వీకారానికి మెగా కోడలు లావణ్య ఎందుకు రాలేదంటే.. కాలికి గాయంతో..
ఈ క్రమంలో రామ్ చరణ్ భార్య ఉపాసన ఓ క్యూట్ ఫోటో షేర్ చేసింది. వరుణ్ తేజ్ పెళ్ళిలో పవన్ కళ్యాణ్ క్లిన్ కారాతో సరదాగా గడిపినప్పటి ఫోటోని ఉపాసన షేర్ చేసింది. ఈ క్యూట్ ఫోటో మొదటి సారి బయటకు రావడంతో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఉపాసన క్లిన్ కారాని ఎత్తుకొని ఉండగా పవన్ క్లిన్ కారాని ప్రేమగా ముద్దు చేస్తున్నట్టు ఉంది. పక్కనే రామ్ చరణ్ కూడా ఉన్నాడు. ఇంత క్యూట్ ఫ్యామిలీ ఫోటోని అభిమానులు తెగ షేర్ చేసేస్తున్నారు. ఇప్పటివరకు బయటకు రాని ఈ ఫోటోని ఉపాసన షేర్ చేసి పవన్ కి కంగ్రాట్స్ తెలిపింది.