Lavanya Tripathi : పవన్ ప్రమాణ స్వీకారానికి మెగా కోడలు లావణ్య ఎందుకు రాలేదంటే.. కాలికి గాయంతో..

పవన్ ప్రమాణ స్వీకారానికి మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి మాత్రం రాలేదు.

Lavanya Tripathi : పవన్ ప్రమాణ స్వీకారానికి మెగా కోడలు లావణ్య ఎందుకు రాలేదంటే.. కాలికి గాయంతో..

Lavanya Tripathi not attended to Pawan Kalyan Taking Oath Ceremony due to Leg Injury

Updated On : June 13, 2024 / 8:27 AM IST

Lavanya Tripathi : నిన్న గన్నవరంలో ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో మెగా ఫ్యామిలీ అంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మెగా కుటుంబ సభ్యులు అంతా కలిసి ఓ బస్సు వేసుకొని మరీ పవన్ ప్రమాణ స్వీకారం చూడటానికి వచ్చారు. అయితే పవన్ ప్రమాణ స్వీకారానికి మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి మాత్రం రాలేదు.

వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ లావణ్య త్రిపాఠి అన్ని మెగా ఫ్యామిలీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, వాటి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అచ్చ తెలుగింటి కోడలు పిల్లగా మార్కులు కొట్టేస్తుంది లావణ్య. అయితే తన కాలికి గాయం అవడంతో నడవలేని పరిస్థితిలో ఉండటం వల్లే లావణ్య పవన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లలేదని తెలుస్తుంది.

Also Read : Akhil Akkineni : వామ్మో అయ్యగారు ఇలా అయిపోయారేంటి.. జుట్టు పెంచేసి అఖిల్ కొత్త లుక్.. సినిమా కోసమేనా?

లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కట్టు వేసి ఉన్న తన కాలు ఫోటో తీసి చికిత్స తీసుకుంటున్నాను అని పోస్ట్ చేసింది. దీంతో లావణ్య ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ గా మారింది. లావణ్య కాలికి గాయం అవడం వల్లే, తను నడవలేని స్థితిలో ఉండటం వల్లే పవన్ ప్రమాణ స్వీకారానికి గన్నవరం రాలేకపోయింది అని తెలుస్తుంది. ఇటీవల పవన్ చిరంజీవి ఇంటికి వచ్చినపుడు కూడా లావణ్య యాక్టివ్ గా ఆ సెలబ్రేషన్స్ లో పాల్గొంది. గన్నవరం వెళ్లకపోవడంతో పవన్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది లావణ్య.

Lavanya Tripathi not attended to Pawan Kalyan Taking Oath Ceremony due to Leg Injury