Mega Cousins : అల్లు రామలింగయ్య – కనకరత్నమ్మలతో మెగా కజిన్స్ చైల్డ్ ఫొటో వైరల్.. చరణ్, బన్నీ ఎంత క్యూట్ గా ఉన్నారో..

ఇటీవల అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ మరణించిన సంగతి తెలిసిందే.(Mega Cousins)

Mega Cousins : అల్లు రామలింగయ్య – కనకరత్నమ్మలతో మెగా కజిన్స్ చైల్డ్ ఫొటో వైరల్.. చరణ్, బన్నీ ఎంత క్యూట్ గా ఉన్నారో..

Mega Cousins

Updated On : September 1, 2025 / 9:31 AM IST

Mega Cousins : సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు బయటకు వచ్చాయంటే అవి వైరల్ అవ్వాల్సిందే. ఎలాంటి సందర్భంలో పోస్ట్ చేసినా ఫ్యాన్స్ వాటిని క్యూట్ ఫోటోలంటూ తెగ వైరల్ చేస్తారు. తాజాగా అల్లు శిరీష్ ఓ చైల్డ్ హుడ్ ఫొటో షేర్ చేసాడు. ఇటీవల అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో అల్లు – మెగా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి.

ఈ క్రమంలో అల్లు శిరీష్ తన నానమ్మ అల్లు కనకరత్నమ్మ, తాతయ్య రామలింగయ్యలతో చిన్నప్పుడు అందరూ కలిసి దిగిన ఫొటో షేర్ చేసి తన నానమ్మతో ఉన్న అనుబంధం గురించి తెలిపాడు. అయితే ఈ ఫొటోలో అల్లు – మెగా కజిన్స్ ఉన్నారు. ఇది చిన్నప్పుడు తీసిన ఫొటో. ఈ ఫొటోలో అల్లు రామలింగయ్య – అల్లు కనకరత్నమ్మలతో పాటు అల్లు శిరీష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సుస్మిత కొణిదెల, శ్రీజలతో పాటు మరికొంతమంది ఉన్నారు.

Mega Cousins Childhood Photos shared by Allu Sirish

Also Read : Nani Son : నాని కొడుక్కి కాలు ఫ్రాక్చర్.. జున్ను అర్ధరాత్రి పూట ఆ మాట అనేసరికి.. నాని ఎమోషనల్..

చరణ్ – బన్నీ చిన్నప్పుడు ఇలా కలిసి క్యూట్ గా కనిపించడంతో ఫ్యాన్స్ ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు.

Mega Cousins Childhood Photos shared by Allu Sirish