వైసీపీ అభ్యర్ధికి మెగా హీరో సపోర్ట్

  • Publish Date - April 7, 2019 / 03:07 AM IST

ఇప్పటికే జనసేనకు సపోర్ట్ చేస్తూ లేఖను విడుదల చేసిన మెగా హీరో అల్లూ అర్జున్..  నంద్యాల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా మరో లేఖను విడుదల చేశారు. తన సన్నిహితుడు అయిన శిల్పా  రవిచంద్రారెడ్డికి శుభాకాంక్షలు చెబుతున్నట్టు అల్లు అర్జున్ తన లేఖలో తెలిపారు. శిల్పాను బన్నీ తన సన్నిహిత మిత్రుడిగా చెబుతూ.. చాలా సంవత్సరాలుగా తనకు మంచి స్నేహితుడిగా ఉన్నాడని, జెంటిల్మన్ అని వివరించాడు.

అయితే, రాజకీయ పార్టీల పరంగా చూస్తే, తాము వేర్వేరు పార్టీలకు చెందినవాళ్లమని, తమ రాజకీయ భావజాలం కూడా పూర్తి భిన్నమని, కానీ స్నేహం కోసం తన మిత్రుడికి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు బన్నీ వివరణ ఇచ్చారు. ఇక అంతకుముందు మామయ్యలు నాగబాబు, పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా లేఖ విడుదల చేశారు.