Pawan Kalyan : పవన్ రాజవైభోగం.. బర్త్ డే రోజు సరదా ఫోటో షేర్ చేసిన మెగా హీరో..

ఈ క్రమంలో మెగా హీరో ఓ పాత ఫోటోని షేర్ చేసి పవన్ కళ్యాణ్ కి స్పెషల్ బర్త్డే విషెస్ తెలిపాడు.

Pawan Kalyan : పవన్ రాజవైభోగం.. బర్త్ డే రోజు సరదా ఫోటో షేర్ చేసిన మెగా హీరో..

Mega Hero Varun Tej Shares Pawan Kalyan Old Photo and Wishes him on Birthday Photo goes Viral

Updated On : September 2, 2024 / 1:01 PM IST

Pawan Kalyan : నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్, అభిమానులతో పాటు సెలబ్రిటీలు పవన్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ కూడా స్పెషల్ గా పాత ఫొటోలు షేర్ చేసి విషెస్ చెప్తుంది. ఈ క్రమంలో మెగా హీరో వరుణ్ తేజ్ ఓ పాత ఫోటోని షేర్ చేసి పవన్ కళ్యాణ్ కి స్పెషల్ బర్త్డే విషెస్ తెలిపాడు.

Also Read : Niharika – Anji : మెగాస్టార్ ‘అంజి’ సినిమాలో నిహారిక చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్టింగ్.. కానీ..

వరుణ్ తేజ్ షేర్ చేసిన ఫొటోలో పవన్ సోఫాలో కూర్చొని ఆశీస్సులు ఇస్తున్నట్టు పోజ్ ఇవ్వగా వరుణ్ తేజ్ కాళ్ళు పట్టుకున్నట్టు, ఇంకొకరు చేతులు నొక్కుతున్నట్టు పోజ్ ఇచ్చారు. ఈ ఫోటో చూస్తే సరదాగా నవ్వకుండా ఉండలేము.

Image

ఈ ఫోటో షేర్ చేసి వరుణ్ తేజ్.. హ్యాపీ బర్త్ డే బాబాయ్.. నిన్ను చూస్తూనే మేము పెరిగాము. నువ్వు ఎంచుకున్న మార్గం, వేరే వాళ్లకు హెల్ప్ చేసే విధానం మాకు స్ఫూర్తినిచ్చింది. ఇదే ఫైర్ నీలో కంటిన్యూ అవ్వాలి. నువ్వు మరింత ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. నా పవర్ తుఫానుకు లవ్ యు అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.