మెగా పవర్ స్టార్ లాంచ్ చేసిన మెగా స్క్రీన్ మల్టీప్లెక్స్
దేశంలోని అతిపెద్ద సినిమా స్క్రీన్‌ను లాంచ్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్.. ఆగస్టు 30 నుండి సాహో ప్రదర్శితం కానుంది..

దేశంలోని అతిపెద్ద సినిమా స్క్రీన్‌ను లాంచ్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్.. ఆగస్టు 30 నుండి సాహో ప్రదర్శితం కానుంది..
దేశంలోని అతిపెద్ద సినిమా స్క్రీన్‌ను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ గురువారం ప్రారంభించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు దగ్గర్లో దేశంలోనే అతిపెద్ద స్క్రీన్‌తో కూడిన మల్టీప్లెక్స్ థియేటర్‌ను మూడెకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ రూ.40 కోట్లతో పిండిపాళెంలో ఈ థియేటర్‌ను నిర్మించింది. ప్రభాస్ కూడా ఇందులో పార్టనర్..
రామ్‌చరణ్ ప్రారంభించిన ఈ థియేటర్‌లో ఈ నెల 30న ‘సాహో’ సినిమాను ప్రదర్శించనున్నారు. ఇందులో మొత్తం మూడు స్క్రీన్లున్నాయి. అందులో ఒకటి అతిపెద్దది కావడం విశేషం.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తయిన తెర, 656 సీటింగ్ కెపాసిటీతో 3డీ సౌండ్ సిస్టమ్‌తో థియేటర్‌ను నిర్మించారు.
Read Also : భీమవరం – ప్రభాస్ సాహో మయం..
డైరెక్టర్ సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్, పి.సి.శ్రీరామ్, ఎన్.వి.ప్రసాద్, వంశీ, ప్రమోద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్టు 30న సాహో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
MegaPowerStar #RamCharan in #Sullurpeta for @v_epiq Theater opening
#Nellore #Vepiq #Saaho#RamCharanAtVepiqMultiplex pic.twitter.com/tYUER0xKJs
— Venkatesh V (@venkatesh_et) August 29, 2019