Chiranjeevi : మదర్స్ డే సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్.. వైరల్..

క‌నిపించే ప్ర‌త్య‌క్ష దైవం అమ్మ. సృష్టిలో ఏ స్వార్థం లేకుండా మ‌న‌పై ప్రేమ చూపించేది అమ్మ మాత్ర‌మే.

Chiranjeevi : మదర్స్ డే సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్.. వైరల్..

Mega star Chiranjeevi special tweet on Mothers Day

Updated On : May 12, 2024 / 11:46 AM IST

క‌నిపించే ప్ర‌త్య‌క్ష దైవం అమ్మ. సృష్టిలో ఏ స్వార్థం లేకుండా మ‌న‌పై ప్రేమ చూపించేది అమ్మ మాత్ర‌మే. కాగా.. నేడు మదర్స్ డే (మే 12 ఆదివారం) సంద‌ర్భంగా జ‌న్మ‌నిచ్చిన మాతృమూర్తిని అంద‌రూ స్మ‌రించుకుంటున్నారు. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు సైతం త‌మ మాతృమూర్తుల‌ను స్మ‌రించుకుంటూ వారితో గ‌డిపిన మ‌ధుర‌మైన జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకుంటూ వారికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి సైతం త‌న త‌ల్లి అంజ‌నా దేవికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేయారు. ‘జన్మనిచ్చి, పెంచి, పోషించిన అమ్మకు ఈ ఒక్క‌ రోజు ఏంటి.. ప్రతి రోజు అమ్మదే.. ఈ జీవితమే అమ్మది.. హ్యాపీ మ‌థ‌ర్స్ డే.’ అంటూ త‌ల్లితో క‌లిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.

Allu Arjun – Shilpa Ravi : వైసీపీ నేత శిల్పా రవి, అల్లు అర్జున్ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? బన్నీకి రాజకీయాలపై ఇంత అవగాహన ఉందా?

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. చిరంజీవి ప్ర‌స్తుతం ‘విశ్వంభ‌ర’ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీకి బింబిసార ఫేం మ‌ల్లిడి వ‌శిష్ఠ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. త్రిష హీరోయిన్‌గా క‌నిపించ‌నున్న ఈ మూవీలో ర‌మ్య ప‌సుపులేటి, సుర‌భి ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండ‌గా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ లు నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2025 జనవరి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.