Mega Star Chiranjeevi : అభిమాని ఆరోగ్యం గురించి ఆరా తీసిన “ఆచార్య”

కోవిడ్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అభిమానికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. అభిమాని చికిత్స పొందుతున్న ఆస్పత్రి డాక్టర్ కు ఫోన్ చేసి అతని ఆరోగ్య పరిస్ధితి అడిగి తెలుసుకున్నారు.

Mega Star Chiranjeevi : అభిమాని ఆరోగ్యం గురించి ఆరా తీసిన “ఆచార్య”

Megastar Acharya

Updated On : May 2, 2021 / 10:13 AM IST

Mega Star Chiranjeevi :  కరోనా వైరస్ చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ సోకుతోంది. కోవిడ్ కు గురైన వారు సరైన సమయంలో గుర్తించి.. సరైన చికిత్స తీసుకుని కోలుకుని సంతోషంగా ఇళ్లకు వెళుతున్నారు. డాక్టర్సు కూడా ఇదే చెపుతున్నారు. ధైర్యంగా ఉంటే కరోనా నుంచి తేలికగా కోలుకోవచ్చని చెపుతున్నారు.

కోవిడ్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అభిమానికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. అభిమాని చికిత్స పొందుతున్న ఆస్పత్రి డాక్టర్ కు ఫోన్ చేసి అతని ఆరోగ్య పరిస్ధితి అడిగి తెలుసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి చిరంజీవి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు. అతనికి ఇటీవల కరోనా సోకటంతో కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న చిరంజీవి ఆస్పత్రి డాక్టర్ కు నేరుగా ఫోన్ చేసి అభిమాని ఆరోగ్య పరిస్ధితి గురించి తెలుసుకున్నారు.

అనంతరం అభిమానికి ఫోన్ చేసారు. “హాయ్ నేను చిరంజీవిని మాట్లాడుతున్నానయ్యా.. నీఆరోగ్యం బాగోలేదని తెలిసింది… నేనుపెద్ద డాక్టర్ గారితో మాట్లాడాను తగ్గిపోతుందిని చెప్పారు” అంటూ అభిమానికి ధైర్యం చెప్పారు. కాసేపు అభిమానితో కూడా మాట్లాడి అతనిలో మనోధైర్యం నింపారు.