అందరం జనతా కర్ఫ్యూ పాటిద్దాం : మెగాస్టార్ చిరంజీవి& కింగ్ నాగార్జున

కరోనా ఎఫెక్ట్ : జనతా కర్ఫ్యూకి మద్దతు తెలిపిన చిరంజీవి, నాగార్జున..

  • Published By: sekhar ,Published On : March 21, 2020 / 06:21 AM IST
అందరం జనతా కర్ఫ్యూ పాటిద్దాం : మెగాస్టార్ చిరంజీవి& కింగ్ నాగార్జున

Updated On : March 21, 2020 / 6:21 AM IST

కరోనా ఎఫెక్ట్ : జనతా కర్ఫ్యూకి మద్దతు తెలిపిన చిరంజీవి, నాగార్జున..

దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో గురువారం (మార్చి-19,2020) భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆదివారం (మార్చి-22) న జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు మోడీ. జనతా కర్ఫ్యూకి పలువురు సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున తమ స్పందన తెలియచేశారు.

చిరు మాట్లాడుతూ :‘‘దేశప్రధానమంత్రి పిలుపుకు స్పందిస్తూ ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మనందరం జనతా curfew పాటిద్దాం. ఇళ్లకే పరిమితం అవుదాం. సరిగ్గా 5 గంటలకు మన గుమ్మాల్లోకి వచ్చి, చప్పట్లతో ప్రతి ఒక్కరం సేవలందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలపాల్సిన సమయం ఇది.

అది మన ధర్మం. భారతీయలుగా మనందరం ఐకమత్యంతో ఒక్కటిగా నిలబడి ఈ క్లిష్ట పరిస్థితులని ఎదుర్కొందాం. సామాజిక సంఘీభావం పలుకుదాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం. జై హింద్’’ అన్నారు. నాగార్జున ప్రధాని మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూను స్వాగతిస్తూ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ట్వీట్ చేశారు.