Jani Master : మెగా మూమెంట్.. డ్యాన్స్ మాస్టర్ జానీ బర్త్ డేని సెలబ్రేట్ చేసిన చిరు, చరణ్..
డ్యాన్సర్ నుంచి స్టార్ డ్యాన్స్ మాస్టర్ గా ఎదిగారు జానీ మాస్టర్. మరోవైపు జనసేన పార్టీలో కూడా కీలకంగా వ్యవహరించారు. దీంతో మెగా ఫ్యామిలీకి మరింత దగ్గరయ్యారు.

Megastar Chiranjeevi and Ram Charan Celebrates Dance Master Jani Master Birthday Photos goes Viral
Jani Master : మెగా ఫ్యామిలీ వాళ్లకు బాగా దగ్గరైన వాళ్ళ పుట్టిన రోజులు, స్పెషల్ డేస్ ని పిలిపించి మరీ సెలబ్రేట్ చేస్తాయి. డ్యాన్సర్ నుంచి స్టార్ డ్యాన్స్ మాస్టర్ గా ఎదిగారు జానీ మాస్టర్. మరోవైపు జనసేన పార్టీలో కూడా కీలకంగా వ్యవహరించారు. దీంతో మెగా ఫ్యామిలీకి మరింత దగ్గరయ్యారు. ఇప్పటికే మెగా హీరోలందరితో జానీ మాస్టర్ పనిచేశారు.
తాజాగా నిన్న జానీ మాస్టర్ పుట్టిన రోజు కావడంతో మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జానీ మాస్టర్ ని ఇంటికి పిలిచి మరీ స్పెషల్ గా బర్త్ డే విషెష్ చెప్పి బహుమతిని అందించారు. దీంతో చరణ్, చిరంజీవిలతో జానీ మాస్టర్ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నా పుట్టిన రోజు నాడు నా ఫేవరేట్ అయిన చిరంజీవి గారు, రామ్ చరణ్ అన్న నుంచి మెగా బ్లెస్సింగ్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చూపించే ప్రేమకు ఎప్పటికి రుణపడి ఉంటాను అని తెలిపాడు.
ఇక నిన్న జానీ మాస్టర్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, పలువురు ప్రముఖులు, జనసేన కార్యకర్తలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయన పని చేస్తున్న సినిమాల నుంచి స్పెషల్ గా విషెష్ చెప్తూ పోస్టర్స్ రిలీజ్ చేసారు. జానీ మాస్టర్ హీరోగా చేస్తున్న రన్నర్ సినిమా నుంచి కూడా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.