Nag Ashwin : ఫ్యామిలీ అంతా డాక్టర్లే.. డాక్టర్ అవ్వబోయి డైరెక్టర్.. ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి తల్లి ఏం చెప్పిందంటే..

నాగ్ అశ్విన్ ని వాళ్ళ పేరెంట్స్ డాక్టర్ ని చేద్దాం అనుకున్నారు.

Nag Ashwin : ఫ్యామిలీ అంతా డాక్టర్లే.. డాక్టర్ అవ్వబోయి డైరెక్టర్.. ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి తల్లి ఏం చెప్పిందంటే..

Kalki Director Nag Ashwin Mother Jayanthi Talk about his Son Interesting Facts

Nag Ashwin : డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు ఇప్పుడు ఇండియా అంతా మారుమోగిపోతుంది. ప్రభాస్ తో కల్కి లాంటి భారీ సినిమా తీసి ప్రేక్షకులని మెప్పించి పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఇక కల్కి సినిమా చూసిన వాళ్లంతా ఆ సినిమా విజువల్స్, యాక్షన్ సీన్స్ కి ఫిదా అయిపోయి నాగ్ అశ్విన్ ని పొగుడుతున్నారు.

అయితే నాగ్ అశ్విన్ ని వాళ్ళ పేరెంట్స్ డాక్టర్ ని చేద్దాం అనుకున్నారు. నాగ్ అశ్విన్ తల్లి తండ్రులు జయరామ్, జయంతి రెడ్డిలు డాక్టర్లు. నాగ్ అశ్విన్ సోదరి కూడా డాక్టర్. వీరికి హైదరాబాద్, వైజాగ్ లో హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. నాగ్ అశ్విన్ ని కూడా డాక్టర్ ని చేద్దామనుకున్నారు.

Also Read : Kiran Abbavaram : భారీ పీరియాడిక్ థ్రిల్లర్ పాన్ ఇండియా సినిమాతో కిరణ్ అబ్బవరం.. బడ్జెట్ ఏకంగా..

ఇటీవల నాగ్ అశ్విన్ తల్లి జయంతి కల్కి సినిమా ముందు 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకు గురించి మాట్లాడుతూ.. నాగ్ అశ్విన్ ని కూడా డాక్టర్ ని చేయాలనుకున్నాం. ఇంటర్లో MBiPC ఇంజనీరింగ్, మెడిసిన్ ఉండే కోర్స్ చేసాడు. ఇంజనీరింగ్, మెడిసిన్ రెండు ఎంట్రన్స్ లు కూడా రాసి క్వాలిఫై అయ్యాడు. కానీ డాక్టర్ అవ్వను అని చెప్పి మణిపాల్ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చేసాడు. ఆ తర్వాత న్యూయార్క్ ఫిలిం అకాడమీ లో డైరెక్షన్ కోర్స్ చేసాడు. ఆ తర్వాత లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ఎవడే సుబ్రహ్మణ్యంతో డైరెక్టర్ గా మారాడు అని తెలిపారు.

ఇలా ఫ్యామిలీ అంతా డాక్టర్లు ఉంటే నాగ్ అశ్విన్ మాత్రం డైరెక్టర్ గా మారి మహానటి, కల్కి సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో అందరూ మెచ్చుకునే సినిమాలు తీశాడు.