Chiranjeevi : తమ్ముడు జనసేనానికి ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేస్తున్న మెగాస్టార్.. ఇండస్ట్రీతో కూడా సపోర్ట్ చేయిస్తూ..

మెగాస్టార్ డైరెక్ట్ గా రంగంలోకి దిగి ఇటీవల ఎక్కువగా పవన్ గురించి మాట్లాడుతున్నారు. భోళా శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ ని అనుకరించారు కూడా. పవన్ ని అనుకరిస్తూ పలు సీన్స్ కూడా ఉన్నాయని చెప్పారు. నా తమ్ముడు అంటూ పవన్ గురించి మాట్లాడుతున్నారు కూడా.

Chiranjeevi : తమ్ముడు జనసేనానికి ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేస్తున్న మెగాస్టార్.. ఇండస్ట్రీతో కూడా సపోర్ట్ చేయిస్తూ..

Megastar Chiranjeevi direct support to Pawan Kalyan Janasena and mega family also supports pawan

Chiranjeevi Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జనసేన(Janasena) పార్టీ పెట్టి ఏపీలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న భారీ ఫాలోయింగ్ ని ఓట్ల రూపంలో మార్చుకోలేకపోతున్నాడు పవన్. ఈ విషయంలో మాత్రం పవన్ సక్సెస్ అవ్వట్లేదు. గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్లా ఓడిపోయాడు. అనుకున్నంత ఓట్లు కూడా రాలేదు. జనసేన గెలిచిన ఒక్క సీట్ కూడా లేకుండా పోయింది. దీంతో పవన్ ఈ సారి మరింతగా జనాల్లోకి వెళ్లేందుకు ట్రై చేస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ దగ్గర ముఖ్యంగా క్యాడర్ లేదు. చెప్పుకోదగ్గ నాయకులు వేళ్ళ మీదే లెక్కపెట్టొచ్చు. ఇది కూడా జనసేన పార్టీకి మైనస్ అవుతుంది. ఇక ఇప్పటికే సినీ, టీవీ ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు అధికారికంగానే జనసేనలో జాయిన్ అయ్యి ప్రచారం చేస్తున్నారు. గతంలో మెగాస్టార్(Megastar) ప్రజారాజ్యం(Prajarajyam) పార్టీ పెట్టి తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు సినీ పెద్దగా సినీ సమస్యల గురించి మాట్లాడటానికి రాజకీయ నాయకులని కలుస్తున్నారు.

అయితే పవన్ అంటే చిరంజీవికి అమితమైన అభిమానం అని అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ని ఎవరన్నా ఏమన్న అంటే ఊరుకోరు. కానీ పవన్ రాజకీయాల్లోకి వెళ్ళాక విమర్శలు తప్పవు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. ఇన్నాళ్లు పవన్ రాజకీయాల గురించి ఎక్కువగా చిరంజీవి మాట్లాడలేదు. ఇండైరెక్ట్ గా కూడా సపోర్ట్ చేయలేదు. కానీ గత కొన్నాళ్లుగా మాత్రం చిరంజీవి ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నారు. చిరంజీవి మాత్రమే కాదు చిరంజీవి చుట్టూ ఉండే వాళ్ళు, మెగా ఫ్యామిలీ సన్నిహితులు, మెగా కాంపౌండ్ లో ఉండే ప్రముఖులంతా కూడా పవన్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఈ ఎలక్షన్స్ లో జనసేనాని ని ఎలాగైనా గెలిపించాలని చూస్తున్నారు.

ఇప్పటికే మెగా కాంపౌండ్ లో ఉండే హైపర్ ఆది(Hyper Aadi), గెటప్ శీను, నిర్మాత skn, అల్లు అరవింద్, పలువురు దర్శకులు హరీష్ శంకర్, బాబీ, సాయి రాజేష్.. ఇలా అనేకమంది ఇండస్ట్రీ ప్రముఖులు కూడా జనసేనానికి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారు అని, పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్తూ మాట్లాడుతున్నారు. ఇటీవల ఏ ఈవెంట్ జరిగినా, ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తుంది. ఇక రామ్ చరణ్(Ram Charan), వరుణ్ తేజ్(Varun Tej), సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), నిహారిక(Niharika).. ఇలా మెగా ఫ్యామిలిలో ఎవర్ని కదిలించినా పవన్ కే మా సపోర్ట్ అంటున్నారు. ఇక బ్రో సినిమా ప్రమోషన్స్ లో తేజ్ అయితే మామయ్య ప్రచారం చేయమంటే చేస్తాను అని డైరెక్ట్ గా చెప్పాడు.

ఇక మెగాస్టార్ డైరెక్ట్ గా రంగంలోకి దిగి ఇటీవల ఎక్కువగా పవన్ గురించి మాట్లాడుతున్నారు. భోళా శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ ని అనుకరించారు కూడా. పవన్ ని అనుకరిస్తూ పలు సీన్స్ కూడా ఉన్నాయని చెప్పారు. నా తమ్ముడు అంటూ పవన్ గురించి మాట్లాడుతున్నారు కూడా. తాజాగా వాల్తేరు వీరయ్య 200 డేస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ ఈవెంట్ లో చిరంజీవి ఏపీ(AP) ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలకు, అంబటి రాంబాబు(Ambati Rambabu) బ్రో(Bro) సినిమా గురించి మాట్లాడిన వ్యాఖ్యలకు కౌంటర్ గా మాట్లాడారు.

Chiranjeevi : ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా సినిమా ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తారెందుకు?

చిరంజీవి ఈవెంట్ లో మాట్లాడుతూ.. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి గురించి ఆలోచించాలి. మీలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి విషయాల గురించి ఆలోచించి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే అందరూ మీకు తల వంచి నమస్కరిస్తారు. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి. ఇదేదో పెద్ద సమస్యలా చూపించకండి అని అన్నారు. దీంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇన్నాళ్లు ఇండైరెక్ట్ గా పవన్ గురించి మాట్లాడిన చిరంజీవి ఇప్పుడు డైరెక్ట్ గా ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే తన తమ్ముడికి మద్దతుగా మాట్లాడాడు. మొత్తానికి ఈ సారి జనసేనకు మెగాస్టార్, తన కాంపౌండ్ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి కావాల్సినంత సపోర్ట్ ఇచ్చేలానే కనిపిస్తున్నారు.