Chiranjeevi : 68 ఏళ్ళ వయసులో జిమ్‌లో మెగాస్టార్ కసరత్తులు.. ‘విశ్వంభర’ కోసం అంటూ..

సినిమా కోసం చిరంజీవి ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతైనా కష్టపడతారు. తాజాగా విశ్వంభర కోసం రెడీ అవుతున్నాను అంటూ జిమ్ లో కష్టపడుతున్న వీడియోని షేర్ చేశారు.

Megastar Chiranjeevi Gearing up for Vishwambhara Movie Shared Gym Video

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ సినిమాగా ‘విశ్వంభర'(Vishwambhara) చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో భారీగా విశ్వంభర తెరకెక్కుతుంది. బియాండ్ యూనివర్స్ అంటూ కొత్త కథతో రాబోతున్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతుంది. ప్రస్తుతం చిరంజీవి లేని షూటింగ్ పార్ట్ ని పూర్తి చేస్తున్నారు. త్వరలోనే చిరంజీవి విశ్వంభర షూట్ లో జాయిన్ అవ్వనున్నారు.

తాజాగా మెగాస్టార్(Megastar) తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. విశ్వంభర కోసం రెడీ అవుతున్నాను అంటూ జిమ్ లో కష్టపడుతున్న వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవి జిమ్ లో బాగా కష్టపడుతున్నారు. జిమ్ లో అన్ని రకాల కసరత్తులు చేస్తున్నారు. ఈ వీడియోలో చిరంజీవి జిమ్ లోకష్టపడటం చూసి 68 ఏళ్ళ వయసులో జిమ్ లో ఈ రేంజ్ లో కష్టపడుతున్నారని అంతా ఆశ్చర్యపోతున్నారు.

సినిమా కోసం చిరంజీవి ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతైనా కష్టపడతారు. ఇలా విశ్వంభర సినిమా కోసం మెగాస్టార్ కష్టపడటం చూసి సినిమా, ఆడియన్స్ కోసం మెగాస్టార్ ఇంత కష్టపడుతున్నారు అంటూ అభినందిస్తున్నారు. త్వరలోనే చిరంజీవి విశ్వంభర షూట్ లో జాయిన్ అవ్వనున్నారు. ఇక విశ్వంభర సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు చిత్రయూనిట్.

Also Read : Keerthy Suresh : బాలీవుడ్ సినిమాకి కీర్తి సురేష్ డేట్స్ ఇవ్వట్లేదా.. హీరో అంత మాట అనేశాడేంటి?

మరో వైపు మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపికయ్యారు. దీంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గత నాలుగు రోజులుగా ఎవరో ఒకరు చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన్ని అభినందిస్తూనే ఉన్నారు. త్వరలోనే చిరంజీవిని అభినందిస్తూ ఓ సన్మాన సభ టాలీవుడ్ తరపున చేయనున్నారు.