Keerthy Suresh : బాలీవుడ్ సినిమాకి కీర్తి సురేష్ డేట్స్ ఇవ్వట్లేదా.. హీరో అంత మాట అనేశాడేంటి?
వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా సినిమాని మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాకి కీర్తి సురేష్ డేట్స్ ఇవ్వట్లేదని తెలుస్తుంది.

Bollywood Hero Varun Dhawan Sensational Comments on Keerthy Suresh
Keerthy Suresh : మహానటి సినిమాతో పాపులర్ అయిన కీర్తి సురేష్ ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ చివరగా భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లిగా చేసింది. ప్రస్తుతం కీర్తి చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు బాలీవుడ్(Bollywood) లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది.
దర్శకుడు అట్లీ నిర్మాతగా మారి బాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడు. వరుణ్ ధావన్(Varun Dhawan) హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా, వామికా గబ్బి సెకండ్ హీరోయిన్ గా కలీస్ దర్శకత్వంలో సినిమాని ఇటీవలే ప్రకటించారు. VD18 వర్కింగ్ టైటిల్ తో ముంబైలో గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ సినిమాని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా తమిళ్ లో విజయ్ తీసిన తేరి సినిమాకు రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకి కీర్తి సురేష్ డేట్స్ ఇవ్వట్లేదని తెలుస్తుంది.
Also Read : Rashmika Mandanna : నేను ఏ పని చేసినా విజయ్ సలహా తీసుకోవాల్సిందే.. వ్యక్తిగతంగా నాకు..
తాజాగా కీర్తి సురేష్ తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేయగా ఆ పోస్ట్ కింద్ వరుణ్ ధావన్.. ప్లీజ్ గివ్ డేట్స్ అమ్మా అని కామెంట్ చేసాడు. దీంతో ఇది వైరల్ గా మారింది. కీర్తి సురేష్ బాలీవుడ్ సినిమాకు డేట్స్ ఇవ్వట్లేదా, బిజీగా ఉందా? లేక వరుణ్ సరదాగా కామెంట్ చేశాడా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కానీ హీరోయిన్ పెట్టిన పోస్ట్ కి ఇలా డేట్స్ ఇవ్వు అని ఒక హీరో రిప్లై ఇవ్వడంతో చర్చగా మారింది.
