ZEE CINE AWARDS : చిరును ఏడిపించిన కార్తికేయ

  • Published By: madhu ,Published On : January 19, 2020 / 07:40 AM IST
ZEE CINE AWARDS : చిరును ఏడిపించిన కార్తికేయ

Updated On : January 19, 2020 / 7:40 AM IST

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరు కార్తికేయ. RX100 సినిమాతో యూత్‌ను అట్రాక్ట్ చేశాడు. కొన్ని సినిమాలతో అభిమానులను సంపాదించుకున్నాడు ఈ కుర్రహీరో. తాజాగా కార్తి..తన మాటలతో చిరు కండ్లలో నీళ్లు తెప్పించే విధంగా చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఇటీవలే ZEE CINE AWARDS హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది.

ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ZEE ఛానెల్ 2020, జనవరి 25, 26వ తేదీల్లో బుల్లితెరపై ప్రసారం చేయనుంది. దీనికి సంబంధించిన కొన్ని ప్రోమోలోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తోంది. అందులో కార్తికేయకు సంబంధించిన వీడియో ఉంది. కార్తి ఇందులో స్టేజ్ ఫెర్మామెన్స్ ఇచ్చారు. చిరంజీవి నటించి అలనాటి హిట్ సాంగ్..‘పదహారేళ్ల వయస్సు..పడి పడి లేచే మనస్సు’ అంటూ డ్యాన్స్ చేశారు.

Read More : కోహ్లీపై రచయిత్రి భావన అరోరా డబుల్ మీనింగ్ ట్వీట్

అనంతరం కార్తి..చిరును ఉద్దేశించి మాట్లాడారు. ‘ఈ ఫెర్మామెన్స్ మీకు అంకితం బాస్..27 ఇయర్స్‌‌లో బెస్ట్ మూవ్ మెంట్.. అంటూ కార్తి..కన్నీరు పెట్టుకున్నారు. ’అందరం ఆయన పిల్లలం..చరణ్ ఒక్కరే కాదు’..అన్నారు. దీనికి చిరంజీవి కండ్లలో కన్నీళ్లు తిరిగాయి. అమాంతం స్టేజ్ మీద నుంచి వచ్చి..చిరు కాళ్లకు దండం పెట్టాడు కార్తి. ఈ సందర్భంగా చిరు..కార్తిని దగ్గరకు హత్తుకున్నారు. ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా రీ ట్వీట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.