Balakrishna Vs Chiranjeevi : ఇంద్రసేనా రెడ్డి వర్సెస్ సమరసింహా రెడ్డి.. నేను రెడీ నువ్వు రెడీనా.. బాలయ్యకు చిరు సవాల్..
చిరంజీవి కూడా బాలయ్య గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసారు.
Balakrishna Vs Chiranjeevi : 1974లో తాతమ్మ కల సినిమాతో బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో బాలయ్య సినీ పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమలోని అన్ని యూనియన్లు కలిసి నిన్న రాత్రి గ్రాండ్ గా బాలకృష్ణ నట స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించారు. బాలయ్య 50 ఏళ్ళ నట స్వర్ణోత్సవ వేడుకల ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేష్, శ్రీకాంత్, నాని, ఉపేంద్ర, శివన్న, మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, రానా, మంచు మనోజ్, రాఘవేంద్రరావు, బోయపాటి, తమన్.. ఇలా ఎంతోమంది నటీనటులు, డైరెక్టర్స్, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి రావడంతో వీరిద్దరూ కలిసి దిగిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవడంతో ఈ ఈవెంట్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఇక చిరంజీవి కూడా బాలయ్య గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసారు.
మెగాస్టార్ చిరంజీవి బాలయ్య ఈవెంట్లో మాట్లాడుతూ.. ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు బాలకృష్ణ. నా ఇంద్ర సినిమాకు బాలకృష్ణ సమరసింహారెడ్డి సినిమానే స్ఫూర్తి. ఇంద్ర సినిమా నా వద్దకు వచ్చినప్పుడు బాలయ్య లాగా నేను చేయగలనా లేదా అనుకున్నాను. నాకు బాలయ్యతో ఫ్యాక్షన్ సినిమా చేయాలని కోరిక. ఇటీవల సీక్వెల్స్, ప్రీక్వెల్స్, పార్ట్ 2 , 3లు ఇలా వస్తున్నాయి కదా. నేను అందరి ముందు చెప్తున్నాను. ఇంద్రసేనా రెడ్డి, సమరసింహా రెడ్డి క్యారెక్టర్స్ ని పెట్టి ఎవరైనా కథ చేస్తే నేను చేయడానికి రెడీ బాలయ్య నువ్వు రెడీనా అని అడగడంతో బాలయ్య కూడా నేను రెడీ రెడీ అని అన్నారు.
అలాగే.. చూసుకోండి మరి బాలయ్య కూడా రెడీ అన్నారు. ఇంద్రసేనా రెడ్డి వర్సెస్ సమరసింహా రెడ్డి క్యారెక్టర్స్ తో కథ ఎవరు తీసుకొస్తారో చూడండి. బోయపాటి కథ రాస్తావా నీకు ఛాలెంజ్. వైవిఎస్ చౌదరి నువ్వు కూడా ట్రై చెయ్.. ఎవరైనా రచయితలు ఈ క్యారెక్టర్స్ తో కథ రాసి తీసుకురండి మేము చేస్తాము అని అన్నారు చిరంజీవి. దీంతో చిరంజీవి బాలకృష్ణ కలిసి నిజంగానే సినిమా చేస్తే బాగుండు, ఆ క్యారెక్టర్స్ తో సినిమా చేస్తే ఇప్పుడు థియేటర్స్ దద్దరిల్లుతాయి అని ఫ్యాన్స్ అంటున్నారు.
Chiru:
Indra movie inspiration Samara Simha Reddy…💥💥
Redu characters tho kalisi sequel cheddam em antav balayya…Balayya : ready ready 🥵
Boyapati yvs Chowdary miru ready na…#NBK50inTFI #NandamuriBalakrishna pic.twitter.com/lJaEcAeIcX
— Sree ✨ (@sreemanth_) September 1, 2024