Chiranjeevi : భోళాశంకర్ సినిమా నుంచి చిరు లీక్స్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగే.. అదిరిపోయే అప్డేట్ మెగా ఫ్యాన్స్ కోసం..

చిరు లీక్స్ అంటూ చిరంజీవి అప్పుడప్పుడు తన సినిమాల అప్డేట్స్ ఇస్తూ అభిమానులని ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా భోళా శంకర్ సినిమా నుంచి కూడా చిరు లీక్స్ చేశారు. అయితే ఈ సారి చిరంజీవి చేసిన లీక్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, మెగా ఫ్యాన్స్ ని ఫుల్ గా ఖుషి చేస్తున్నాయి.

Chiranjeevi : భోళాశంకర్ సినిమా నుంచి చిరు లీక్స్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగే.. అదిరిపోయే అప్డేట్ మెగా ఫ్యాన్స్ కోసం..

Megastar Chiranjeevi leaks from Bhola Shankar movie Pawan Fans full happy

Updated On : July 16, 2023 / 9:48 PM IST

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి త్వరలో భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా జంటగా కీర్తి సురేష్, సుశాంత్, పలువురు ముఖ్యపాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇక టీజర్, సాంగ్స్ కూడా రిలిజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్. సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

ఇక చిరు లీక్స్ అంటూ చిరంజీవి అప్పుడప్పుడు తన సినిమాల అప్డేట్స్ ఇస్తూ అభిమానులని ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా భోళా శంకర్ సినిమా నుంచి కూడా చిరు లీక్స్ చేశారు. అయితే ఈ సారి చిరంజీవి చేసిన లీక్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, మెగా ఫ్యాన్స్ ని ఫుల్ గా ఖుషి చేస్తున్నాయి. తన వాయిస్ ఓవర్ తో చిరంజీవి తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో.. ఎప్పటిలాగే చిరు లీక్స్ తో వచ్చాను. భోళా శంకర్ సినిమా నుంచి మీకోసం ఒక అప్డేట్ తెచ్చాను. మెహర్ రమేష్ తిట్టుకున్నా పర్లేదు. తమ్ముడు పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో నా ఫొటోలు, నా డైలాగ్స్, నా సాంగ్స్ తో మిమ్మల్ని అలరించాడు. ఇప్పుడు నేను మీ కోసం తమ్ముడి డైలాగ్స్, మేనరిజమ్స్ ఈ సినిమాలో అనుకరించబోతున్నాను. ఇది మిమ్మల్ని, అభిమానులని ఎంటర్టైన్ చేస్తుందని భావిస్తున్నాను అని తెలిపారు.

Jailer : రజినీకాంత్ ‘జైలర్’ సినిమాపై కోర్టులో పిటిషన్.. టైటిల్ నాది అంటున్న మలయాళం డైరెక్టర్..

దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మెగాస్టర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేయడం అంటే అభిమానులకి పండగే. ఇక చిరు షేర్ చేసిన వీడియోలో ఆల్రెడీ ఓ చిన్న బిట్ కూడా రిలీజ్ చేశాడు. ఇందులో పవన్ ఏ మేరా జహాఁ సాంగ్ ప్లే చేసి పవన్ లాగ మెడ మీద చెయ్యి వేసి అలరించారు చిరంజీవి. దీంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక చిన్న వీడియో బిట్ లోనే ఇంత ఉందంటే సినిమాలో ఏ రేంజ్ లో పవన్ ని మెగాస్టార్ అలరిస్తారో చూడాలి.