చిరు ఫస్ట్ ట్వీట్ చూశారా!

ఉగాది పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు..

  • Published By: sekhar ,Published On : March 25, 2020 / 06:22 AM IST
చిరు ఫస్ట్ ట్వీట్ చూశారా!

Updated On : March 25, 2020 / 6:22 AM IST

ఉగాది పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు..

కొత్త  తెలుగు సంవత్సరాది.. ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు, అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ చిరు మొట్టమొదటి ట్వీట్ చేశారు.

‘తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులందరితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగటం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం. ఇంటి పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం’. అంటూ చిరు ట్వీట్ చేశారు.  

Read Also : ‘రౌద్రం రణం రుధిరం’- పోస్టర్‌కే పూనకం తెప్పించాడుగా!

కరోనా కారణంగా షూటింగులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. చిరు, కొరటాల కాంబోలో రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా ఎంపికైంది. చిరు నటిస్తున్న 152వ సినిమా ఇది.