Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ టీజర్ వచ్చేసింది.. రెక్కల గుర్రంపై మెగాస్టార్ ఆగమనం అదిరిందిగా..

మీరు కూడా విశ్వంభర టీజర్ చూసేయండి..

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ టీజర్ వచ్చేసింది.. రెక్కల గుర్రంపై మెగాస్టార్ ఆగమనం అదిరిందిగా..

Megastar Chiranjeevi Vishwambhara Movie Teaser Released Watch Here

Updated On : October 12, 2024 / 10:57 AM IST

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి యువీ క్రియేషన్స్ లో డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా నేడు దసరా పండగ పూట ‘విశ్వంభర’ టీజర్ రిలీజ్ చేసారు.

టీజర్ చూస్తుంటే రాక్షసుల లోకం, మరో ప్రపంచం ఉన్నట్టు, చిరంజీవికి దైవాంశ ఉన్నట్టు, దుష్టశక్తులను ఎదిరించినట్టు తెలుస్తుంది. టీజర్ లో మొత్తం గ్రాఫిక్స్ తోనే నిండిపోయింది. చిరంజీవి తెల్లని రెక్కల గుర్రంపై వచ్చే షాట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా విశ్వంభర టీజర్ చూసేయండి..

విశ్వంభర సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో పాటు సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా చిరంజీవికి చెల్లెలుగా మరో అయిదుగురు నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ అనుకున్నారు. కానీ గేమ్ ఛేంజర్ సంక్రాంతికి వాయిదా వేయడంతో విశ్వంభర సినిమాని వాయిదా వేశారు.