ఏఐజీ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపిన చిరు..

ఏఐజీ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపిన చిరు..

Updated On : February 19, 2021 / 12:58 PM IST

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిగా పేరొందిన AIG (Asian Institute of Gastroenterology) హాస్పిటల్‌ను సందర్శించారు.
హాస్పిటల్ ఛైర్మన్, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత డా. డి. నాగేశ్వర్ రెడ్డితో పాటు వారి బృందాన్ని ఆయన అభినందించారు.

Chiranjeevi

లాక్‌డౌన్ సమయంలో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, తమ అద్భుతమైన ప్రతిభతో ఎందరో ప్రాణాలను కాపాడిన డా. నాగేశ్వర్ రెడ్డి గారికి చిరు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వారి వైద్య బృందం చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.

Chiranjeevi

హాస్పిటల్ అంతా కలియ తిరుగుతూ వైద్యులతో కాసేపు ముచ్చటించారు. తర్వాత నాగేశ్వర్ రెడ్డి టీమ్ మెగాస్టార్‌తో ఫొటోలు తీసుకున్నారు. ఈ ఫొటోలను తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఏఐజీ వైద్య బృందానికి కృతజ్ఞతలు, అభినందనలు తెలపడం ఆనందంగా ఉందన్నారు మెగాస్టార్.