Balakrishna – Chiranjeevi : బాలయ్య కోసం రాబోతున్న మెగాస్టార్.. ఆహ్వానం అందింది..

పలు యూనియన్ల ప్రముఖులంతా కలిసి చిరంజీవిని బాలకృష్ణ 50 ఏళ్ళ వేడుకలకు రమ్మని ఆహ్వానించారు.

Balakrishna – Chiranjeevi : బాలయ్య కోసం రాబోతున్న మెగాస్టార్.. ఆహ్వానం అందింది..

Megastar Chiranjeevi will grace Blakrishna 50 Years Special Event Conducting by Tollywood

Updated On : August 20, 2024 / 12:33 PM IST

Balakrishna – Chiranjeevi : నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానం మొదలుపెట్టి 50 ఏళ్ళు అవుతుండటంతో అభిమానులు, సినీ పరిశ్రమ బాలకృష్ణ స్వర్ణోత్సవ సంబరాలు సెలబ్రేట్ చేయడానికి సిద్దమయ్యారు. ఓ పక్క అభిమానులు 50 రోజుల ముందు నుంచే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో తెలుగు ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్.. ఇలా పలు యూనియన్స్ అన్ని కలిసి బాలయ్య స్వర్ణోత్సవ సంబరాల వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నారు.

హైదరాబాద్ లో టాలీవుడ్ తరపున బాలయ్య 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలని 1 సెప్టెంబరు 2024న గ్రాండ్ గా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది హాజరు కాబోతున్నారు. తాజాగా టాలీవుడ్ ఈ వేడుకలకు రమ్మని మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించింది. పలు యూనియన్ల ప్రముఖులంతా కలిసి చిరంజీవిని బాలకృష్ణ 50 ఏళ్ళ వేడుకలకు రమ్మని ఆహ్వానించారు.

Chiranjeevi Balakrishna

Also Read : Kiran Abbavaram – Rahasya Gorak : చిరంజీవి పుట్టిన రోజున కిరణ్ అబ్బవరం పెళ్లి..? ఎక్కడో తెలుసా..?

చిరంజీవి ఈ ఆహ్వానానికి పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్టు సమాచారం. దీంతో బాలయ్య 50 ఏళ్ళ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నాడని, మరోసారి వీరిద్దరూ కలిసి ఒకే స్టేజిపై కనిపించబోతున్నారని తెలుస్తుంది. చిరంజీవి వస్తానని చెప్పడంతో మెగా, నందమూరి అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో టాలీవుడ్ స్టార్స్ అంతా బాలయ్య కోసం తరలివస్తే ఆ ఈవెంట్ వైరల్ అవ్వడమే కాక చాలా ఏళ్ళ పాటు కచ్చితంగా గుర్తుండిపోతుందని అంటున్నారు. ఇక టాలీవుడ్ ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే పనులు మొదలుపెట్టింది.

Megastar Chiranjeevi will grace Blakrishna 50 Years Special Event Conducting by Tollywood