ఉగాదికి మెగాస్టార్-యంగ్ రెబల్ స్టార్..

ఉగాది కానుకగా మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమాల అప్‌డేట్స్..

  • Published By: sekhar ,Published On : March 11, 2020 / 09:23 AM IST
ఉగాదికి మెగాస్టార్-యంగ్ రెబల్ స్టార్..

Updated On : March 11, 2020 / 9:23 AM IST

ఉగాది కానుకగా మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమాల అప్‌డేట్స్..

మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమాల అప్‌డేట్స్ ఉగాది పండుగ సందర్భంగా తెలియచేయనున్నారు దర్శక నిర్మాతలు.. చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘ఆచార్య’.. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.

ఇటీవల ఓ ఫంక్షన్‌లో స్వయంగా చిరునే తన సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఇంతకుముందే చిరు లీక్డ్ పిక్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఉగాది పండుగ సందర్భంగా చిరు 152 చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ‘జిల్’ ఫేమ్ రాధకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమాకి ‘జాన్’ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు.

సమంత, శర్వానంద్ నటించిన ‘96’ తెలుగు రీమేక్ కోసం ‘జాను’ టైటిల్ పెట్టడంతో మరో టైటిల్ వెతికే పనిలో ఉంది మూవీ టీమ్.. ‘రాధే శ్యామ్’ అనే పేరు ఫిక్స్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఉగాది కానుకగా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. గోపికృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 

See Also | ‘సేమ్ టు సేమ్’.. ఎన్టీఆర్ చిన్నకొడుకు పిక్ వైరల్..