మైఖేల్ జాక్సన్.. నిన్నెందుకు మర్చిపోతాం!

  • Published By: sekhar ,Published On : August 29, 2020 / 07:09 PM IST
మైఖేల్ జాక్సన్.. నిన్నెందుకు మర్చిపోతాం!

Updated On : August 29, 2020 / 7:33 PM IST

Micheal Jackson birth anniversary: HIStory Concert కోసం ఇండియా రావడానికి ముందే మైఖేల్ జాక్సన్ గురించి ఇండియాలో అందరికీ తెలుసు. మెట్రోస్‌లో పాటలింటే… చిరంజీవి లాంటి హీరోలు వేసిన స్టెప్‌లతో ఊళ్లకూ పాక్ కింగ్ గురించి బాగానే తెలుసు. ఎంజే అంటే ఉప్పెన, ఆ పేరు చాలా ఫేమస్. ఆయన స్టోరీయే పాప్ మ్యూజిక్ స్టోరీ. అమెరికన్ స్టోరీ. మైఖేల్ జాక్సన్ బ్లాక్‌ అన్న సంగతి గుర్తుకురాదు. మ్యూజిక్, మూన్‌వాక్ మాత్రమే గుర్తుకొస్తుంది.

odissi in michael jackson

Black or White సాంగ్‌లో మైఖేల్‌తో ఒడిస్సీ డ్యాన్సర్ … స్టెప్ లేస్తుంది. ఈ 21 సెకండ్ల క్లిప్ లాస్ ఏంజిల్స్ ఎక్స్‌‌ప్రెస్ వే మీద షూట్ చేశారు. ఈ క్లిప్ చాలు ఇండియాకు దగ్గర కావడానికి. ఈ సాంగ్ చివరి చరణంలోనూ తాజ్ మహల్ కనిపిస్తుంది. రేసిజానికి వ్యతిరేకంగా ఈ సాంగ్ గొప్ప సెన్సేషన్. అలాగే వివాదస్పదం కూడా.Micheal Jacksonఇంతకుముందు ఏ సింగర్ చేయని సాహసాన్ని ఎంజే చేసి చూపించాడు. మైఖేల్ జాక్సన్ ఇంపాక్ట్ ఇండియన్ మూవీస్ మీద చాలా కనిపిస్తుంది. ‘దొంగ’ సినిమాలో చిరంజీవి ఏకంగా THRILLER సాంగ్ లోని స్టెప్స్‌తో MJకి ట్రిబ్యూట్ ఇస్తాడు.

Prabhudeva

జాక్సన్‌కి Remo D’Souza గొప్ప అభిమాని. పాక్ కింగ్ ప్రేరణతోనే 2013లో ‘ABCD: Any Body Can Dance’ తీశాడు. ఇక ప్రభుదేవా Indian Michael Jackson. తన సినిమాల్లో MJ’s signature movesని ప్రదర్శిస్తాడు. ఇది పాప్ కింగ్‌కు ప్రభుదేవా ట్రిబ్యూట్.

Prabhudeva Michael

పాప్ కింగ్‌కి ఇండియాలో వెర్రి ఫ్యాన్స్ ఉన్నారు. 2016లో జాక్సన్ ఫ్యాన్ చంద్రశేఖరన్… అచ్చం పాప్ కింగ్ 100 అడుగుల గ్రానైట్ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ప్రభుదేవా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Micheal Jackson

ఇండియాకు జాక్సన్ రావడం గొప్ప పండుగ. ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్‌కు వస్తూనే బాల్ థాకరే ఇంటికెళ్లారు. 1996 నవంబర్1 న కాన్సర్ట్. అంథేరి కాంప్లెక్స్‌కి ఆనాడు గొప్ప ఎనర్జీ వచ్చింది. టిక్కెట్ దొరికినవాళ్లు అదృష్టవంతులు. అక్కడే ఇండియా పట్ల తన ప్రేమను చూపించారు. ‘I love you India’ ‘Sabse Pyara Hindustan’ అని అన్నారు Michael.
ఎక్కువ మందికి ఈ సంగతి తెలియకపోవచ్చు.

Micheal Jackson

2001లో MJతో AR Rehman పాటను ట్యూన్ చేశారు. సగం సంస్కృతం, సగం ఇంగ్లీషులో ఉండే ఈ సాంగ్‌ పాడింది… రెహమానే. పేరు Ekam Satyam. రెహమాన్ సంస్కతం చరాణన్ని, ఇంగ్లీషులో Jackson పాడారు.
ఇప్పటికీ ఇండియన్ సినిమా పాటల్లో మైఖేల్ జాక్సన్ స్టెప్స్ కనిపిస్తాయి. అచ్చం ఆయనలా ఎవరైనా డ్యాన్స్ చేస్తే వైరల్ అవుతారు. అది mj మహిమ.

A. R. Rahman