‘దంగల్’ బ్యాచ్‌కి ‘పొంగల్’ బ్యాచ్‌కి ఏమైనా సెట్ అవుతాదా? : మిస్‌మ్యాచ్ – ట్రైలర్

‘మిస్‌మ్యాచ్’.. (ఈజ్ ది రియల్ మ్యాచ్) థియేట్రికల్ ట్రైలర్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా విడుదలైంది..

  • Published By: sekhar ,Published On : November 20, 2019 / 05:51 AM IST
‘దంగల్’ బ్యాచ్‌కి ‘పొంగల్’ బ్యాచ్‌కి ఏమైనా సెట్ అవుతాదా? : మిస్‌మ్యాచ్ – ట్రైలర్

Updated On : November 20, 2019 / 5:51 AM IST

‘మిస్‌మ్యాచ్’.. (ఈజ్ ది రియల్ మ్యాచ్) థియేట్రికల్ ట్రైలర్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా విడుదలైంది..

తమిళ్‌లో విజయ్ ఆంటోని హీరోగా ‘డా.సలీమ్’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఎన్.వి.నిర్మల్ కుమార్ తెలుగులో తెరకెక్కిస్తున్న సినిమా.. ‘మిస్‌మ్యాచ్’.. (ఈజ్ ది రియల్ మ్యాచ్) ‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్నారు.

అధిరోహ్ క్రియేటివ్ సిగ్న్స్ బ్యానర్‌పై జి.శ్రీరామ్ రాజు, కె.భరత్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ బుధవారం ఉదయం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా విడుదలైంది. ‘కౌసల్యా కృష్ణమూర్తి’ లో క్రికెటర్‌గా ఆకట్టుకున్న ఐశ్వర్యా రాజేష్ ఈ మూవీలో రెజ్లర్‌గా కనిపించనుంది. సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Read Also : నిన్ను చూస్తే గర్వంగా ఉంది సీతూ పాప : మహేశ్ బాబు
ప్రముఖ రచయిత భూపతిరాజా ఈ సినిమాకి కథనందించారు. డిసెంబర్ 6న ‘మిస్‌మ్యాచ్’ విడుదలవుతోంది. కెమెరా : గణేష్ చంద్ర, ఎడిటింగ్ : ఎస్‌పీ రాజా సేతుపతి, సంగీతం : గిఫ్టన్ ఇలియాస్, మాటలు : రాజేంద్ర కుమార్.