Mission Impossible : మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ పార్ట్ 1 మూడు రోజుల్లో 2000 కోట్ల కలెక్షన్స్.. ఇండియాలో ఎంతో తెలుసా?

మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కి ఇండియాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఇండియాలో కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మిషన్ ఇంపాజిబుల్ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

Mission Impossible : మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ పార్ట్ 1 మూడు రోజుల్లో 2000 కోట్ల కలెక్షన్స్.. ఇండియాలో ఎంతో తెలుసా?

Mission Impossible Dead Reckoning part 1 worldwide collections

Updated On : July 15, 2023 / 11:37 AM IST

Mission Impossible Collections :  హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల సిరీస్ లలో మిషన్ ఇంపాజిబుల్ ఒకటి. హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్(Tom Cruise) ముఖ్య పాత్రలో ఈ సిరీస్ లోని ఏడవ సినిమా రిలీజ్ అయింది. మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ పార్ట్ 1 పేరుతో జులై 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో టామ్ క్రూజ్ తో పాటు పలువురు హాలీవుడ్ స్టార్ యాక్టర్స్ ముఖ్య పాత్రల్లో నటించారు. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కి ఇండియాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఇండియాలో కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మిషన్ ఇంపాజిబుల్ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమా కలెక్షన్స్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ పార్ట్ 1. ఈ సినిమా ఇండియాలో మొదటి రోజే దాదాపు 12 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక సినిమా రిలీజయి మూడు రోజులు అవ్వగా ఇండియాలో మూడు రోజుల్లో 30 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా శని, ఆది వారాలు వీకెండ్స్ ఉండటంతో దాదాపు 50 కోట్లపైనే కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Priyanka Chopra : హాలీవుడ్ యాక్టర్స్ సమ్మెకు మద్దతుగా ప్రియాంక చోప్రా..

ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అనేక దేశాల్లో రిలీజయింది. మూడు రోజుల్లోనే మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ పార్ట్ 1 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 2000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18 వేల కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఇదే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది ప్రపంచవ్యాప్తంగా. మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ పార్ట్ 1 సినిమా కూడా కనీసం 10 వేల కోట్లు టార్గెట్ పెట్టుకుంది. ఇంకా వీకెండ్ ఉండటంతో ఈజీగానే వస్తాయని భావిస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాని ఆల్మోస్ట్ 2000 కోట్లతో తెరకెక్కించారు.