ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబు.. విచారణకు రావాలని పోలీసుల నోటీసులు

మంచు విష్ణుతో కలిసి ఆయన కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. మోహన్ బాబుకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబు.. విచారణకు రావాలని పోలీసుల నోటీసులు

Mohan Babu

Updated On : December 10, 2024 / 9:50 PM IST

హైదరాబాద్‌లోని జల్‌పల్లిలోని తన ఇంటి వద్ద మీడియా ప్రతినిధిపై దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి సినీనటులు మంచు మోహన్ బాబు, విష్ణు వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ మనోజ్ తో పాటు అతడి భార్య మాత్రమే ఉన్నారు. మోహన్ బాబును, విష్ణును అక్కడ నుంచి పోలీసులే బయటికి పంపించారు. రేపు ఉదయం రాచకొండ సీపీ ఎదుట హాజరు కావాలంటూ మోహన్ బాబుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబు చేరారు. మంచు విష్ణుతో కలిసి కాంటినెంటల్ ఆసుపత్రికి ఆయన వెళ్లారు. మోహన్ బాబుకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మోహన్ బాబు, విష్ణు నుంచి లైసెన్స్డ్‌ తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు, మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చేసిన దాడిని జర్నలిస్టు సంఘాలు టీయూడబ్ల్యూజే, హెచ్‌యూజే, డబ్ల్యూజేఐ, ఫిల్మ్‌ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖండించాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేశాయి. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.

Mohan babu: మీడియాపై మోహన్ బాబు దాడి.. మహేశ్ భగవత్‌ను కలిసిన మంచు మనోజ్ దంపతులు