Mohan babu: మీడియాపై మోహన్ బాబు దాడి.. మహేశ్ భగవత్‌ను కలిసిన మంచు మనోజ్ దంపతులు
అక్కడ మనోజ్, మౌనికను బౌన్సర్లు అడ్డుకున్నారు. మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు గేట్లు తీయకపోవడంతో బౌన్సర్లపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Mohan babu
మీడియా ప్రతినిధిపై సినీనటుడు మంచు మోహన్ బాబు దాడి చేశారు. హైదరాబాద్, జల్‌పల్లిలోని సినీనటుడు మంచు మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇవాళ సాయంత్రం తన భార్య మౌనికతో కలిసి అడిషనల్ డీజీపీని కలిసిన మంచు మనోజ్ అనంతరం మళ్లీ జల్పల్లికి వచ్చాడు.
అక్కడ మనోజ్, మౌనికను బౌన్సర్లు అడ్డుకున్నారు. మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు గేట్లు తీయకపోవడంతో బౌన్సర్లపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరకు గేట్లను నెట్టుకుని లోపలికి వెళ్లాడు. ఆయన వెంట మీడియా కూడా లోపలికి వెళ్లడంతో మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు.
మీడియా ప్రతినిధులపై మోహన్ బాబుతో పాటు ఆయన బౌన్సర్లు కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. మోహన్ బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై కర్రలతో దాడి చేసినట్లు సమాచారం. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. తాజా పరిణామాలపై అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ ను మనోజ్ దంపతులు కలిశారు.
రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను వివరించారు. తనకి భద్రత కల్పించాలని మనోజ్, మౌనిక కోరారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. రాచకొండ సిపీ సుధీర్ బాబును కలవాలని వారికి మహేశ్ భగవత్ సూచించారు.
‘ఒరేయ్ మనోజ్.. గుండెల మీద తన్నావ్ కదరా’ అంటూ మోహన్ బాబు సంచలన ఆడియో