Mohan Babu : చిరంజీవి బాటలో మోహన్ బాబు.. మలయాళ సినిమా రీమేక్ లో ??
ఇదే బాటలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా మలయాళ సినిమా రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25' సినిమా రీమేక్ హక్కులు మంచు విష్ణు కొన్నట్టు..................

Mohan Babu will remake malayalam film android kunjappan
Mohan Babu : ఇటీవల టాలీవుడ్ తో పాటు మలయాళ సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి. అందరు మన టాలీవుడ్ సినిమాల వైపు చూస్తుంటే మనమేమో మలయాళ సినిమాల వైపు చూస్తున్నాం. ఇప్పటికే పలు మలయాళ సినిమాలు రీమేక్ చేయగా మరిన్ని రీమేక్ చేస్తున్నారు టాలీవుడ్ లో. ఇటీవల చిరంజీవి కూడా మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ని రీమేక్ చేసి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇదే బాటలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా మలయాళ సినిమా రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ సినిమా రీమేక్ హక్కులు మంచు విష్ణు కొన్నట్టు సమాచారం. ఇందులో మెయిన్ లీడ్ ని మోహన్ బాబుతో చేయించాలని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఆహాలో ఆల్రెడీ ఆండ్రాయిడ్ కట్టప్ప అనే పేరుతో రీమేక్ అవ్వడం గమనార్హం.
BiggBoss 6 Day 38 : కొనసాగుతున్న ఎమోషనల్ టాస్క్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..
ఇటీవల మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా సినిమాతో ప్రేక్షకులని పలకరించారు. ఈ సినిమా దారుణమైన పరాజయం పొందింది. ప్రస్తుతం మంచు లక్ష్మితో కలిసి అగ్ని నక్షత్రం సినిమా అచేస్తున్నారు మోహన్ బాబు. గ్రాండ్ కంబ్యాక్ కోసం మోహన్ బాబు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మలయాళ సినిమా డైలాగ్ కింగ్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి మరి.