Mohana Raja : వారసత్వం అంటే పదవి కాదు భాద్యత.. రామ్ చరణ్ ప్రతి రోజు అది ప్రూవ్ చేసుకుంటున్నారు..

ఈవెంట్ లో డైరెక్టర్ మోహన రాజా మాట్లాడుతూ..''నేను 20 ఏళ్ళ తర్వాత ఒక తెలుగు సినిమా డైరెక్టర్ గా స్టేజి మీద మాట్లాడుతున్నాను. ఇది చిరంజీవి గారి వల్లే. ఆయన నన్ను...........

Mohana Raja : వారసత్వం అంటే పదవి కాదు భాద్యత.. రామ్ చరణ్ ప్రతి రోజు అది ప్రూవ్ చేసుకుంటున్నారు..

Mohana Raja

Updated On : April 23, 2022 / 9:36 PM IST

Mohana Raja :  మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వనుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించగా కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా సినిమాని నిర్మించారు. ఆచార్య సినిమాకి సంబంధించి మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ(ఏప్రిల్ 23న) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగింది. ఈ ఈవెంట్ కి మెగా అభిమానులు భారీగా తరలి వచ్చారు.

 

ఈ ఈవెంట్ లో డైరెక్టర్ మోహన రాజా మాట్లాడుతూ..”నేను 20 ఏళ్ళ తర్వాత ఒక తెలుగు సినిమా డైరెక్టర్ గా స్టేజి మీద మాట్లాడుతున్నాను. ఇది చిరంజీవి గారి వల్లే. ఆయన నన్ను డైరెక్టర్ గా సెలెక్ట్ చేశారు. అందుకు థ్యాంక్ యు చిరంజీవి సర్. మా నాన్న గారు ఎడిటర్ మోహన్ గారు చిరంజీవి హిట్లర్ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఒక నిర్మాతగా ఆ సినిమాకి అన్ని పక్కనే ఉండి చూసే వాడ్ని. అప్పట్నుంచి ఇప్పుడు ఆయనని డైరెక్ట్ చేసే దాకా ఒక ఫ్యాన్ గానే వచ్చాను. ఆయనని చూసిన ప్రతి సారి వావ్ అనిపిస్తుంది. మా సినిమా ఇంకా ఒక్కరోజే టాకీ పార్ట్ మిగిలి ఉంది. మా గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంకా చాలా చాలా మాట్లాడతాను. చరణ్ గారు నా తమిళ్ తని ఒరువన్ సినిమాని తెలుగులో ‘ధ్రువ’గా అద్భుతంగా చూపించారు. అప్పుడే గర్వంగా ఫీల్ అయ్యాను. మా గాడ్ ఫాదర్ లో ఒక డైలాగ్ ఉంది. వారసత్వం అంటే పదవి కాదు భాద్యత. దానికి బెస్ట్ ఉదాహరణ రామ్ చరణ్. ఆ భాద్యతని ప్రతి రోజు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ సినిమాకి పని చేసిన సగం మంది మా సినిమాకి కూడా పని చేస్తున్నారు. చిరంజీవి గారు ఆచార్య సినిమా గురించి మాకు బాగా చెప్పేవారు. ఈ సినిమా యూనిట్ అందరికి అల్ ది బెస్ట్” అని తెలిపారు.

Director Bobby : ఇండస్ట్రీకి పదేళ్లు దూరమై మళ్ళీ వచ్చినా ఆయన చైర్ ఆయనకే ఉంది

ఇప్పటికే ఈ సినిమా నుంచి లాహే లాహె, నీలాంబరి, సానా కష్టం, భలే భలే బంజారా లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయి భారీ స్పందన తెచ్చుకున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఆచార్య సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.