L2E Empuraan : లూసిఫర్ 2 టీజర్ వచ్చేసింది.. అబ్రహం ఖురేషి మళ్ళీ వస్తున్నాడు..

తాజాగా లూసిఫర్ 2 సినిమా టీజర్ రిలీజ్ చేసారు.

L2E Empuraan : లూసిఫర్ 2 టీజర్ వచ్చేసింది.. అబ్రహం ఖురేషి మళ్ళీ వస్తున్నాడు..

Mohanlal Prithviraj Sukumaran Lucifer 2 Empuraan Movie Teaser Released

Updated On : January 26, 2025 / 7:48 PM IST

L2E Empuraan Teaser : మలయాళం స్టార్ హీరో మోహ‌న్ లాల్ మెయిన్ లీడ్ లో మరో హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ లూసిఫర్‌ సినిమా పెద్ద హిట్ అయింది. కరోనా సమయంలో తెలుగులో కూడా ఓటీటీలోకి వచ్చి హిట్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు. సీక్వెల్ సినిమా ‘లూసిఫర్ 2 : ఎంపురాన్‌’ అనే టైటిల్‌ తో రాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.

Also Read : Balakrishna : పద్మ భూషణ్ రావడంపై మొదటిసారి మీడియాతో మాట్లాడిన బాలయ్య.. లేట్ గా వచ్చిందా అని అడిగితే..

లూసిఫర్ 2 సినిమా టీజర్ చూసేయండి..

టీజర్ చూస్తుంటే.. పార్ట్ 1 నుంచి లీడ్ తీసుకొని హీరో స్టీఫెన్ గట్టుపల్లి అప్పటి రాజకీయాలను ఎలా మార్చాడు అసలు అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అబ్రహం ఖురేషిగా ఎందుకు మారాడు? మళ్ళీ అబ్రహం ఖురేషీగా వచ్చినట్టు చూపించారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. సినిమా పార్ట్ 1 కంటే ఇంకా స్టైలిష్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

Also Read : Nara Bhuvaneswari : మా పుట్టింటికి రెండో పద్మం.. బాల అన్నయ్య అంటూ నారా భువనేశ్వరి ఎమోషనల్ ట్వీట్..

ఈ సినిమాని ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో మంజు వారియర్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్.. లాంటి స్టార్స్ నటిస్తున్నారు. పార్ట్ 1 మళయాళంలోనే రిలీజ్ అవ్వగా లూసిఫర్ 2 మాత్రం పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని మార్చ్ 27 రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. లూసిఫర్ పార్ట్ 1 సినిమాని చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.