Kanak Rele : లెజెండరీ క్లాసికల్ డాన్సర్ మృతి.. ప్రముఖులు సంతాపం!

మోహినియాట్టం నృత్యంతో ప్రపంచ ప్రఖ్యాత చెందిన లెజెండరీ క్లాసికల్ డాన్సర్ 'కనక్ రెలే'.. 85 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్త..

Kanak Rele : లెజెండరీ క్లాసికల్ డాన్సర్ మృతి.. ప్రముఖులు సంతాపం!

Kanak Rele

Updated On : February 23, 2023 / 2:23 PM IST

Kanak Rele : మోహినియాట్టం నృత్యంతో ప్రపంచ ప్రఖ్యాత చెందిన లెజెండరీ క్లాసికల్ డాన్సర్ ‘కనక్ రెలే’.. 85 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్త నృత్య కళాకారులతో పాటు సినీ మరియు ఇతర కళాకారులను కూడా తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యేలా చేసింది. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె సోమవారం (ఫిబ్రవరి 20) నాడు కన్నుమూశారు. బుధవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.

Subi Suresh : సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ లేడీ కమెడియన్ మృతి..

ఇక ఆమె మరణానికి చింతిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, బాలీవుడ్ నటి హేమ మాలిని మరియు సుధా చంద్రన్.. శాస్త్రీయ నృత్యాన్నికి ఆమె అందించిన సేవలు గుర్తు చేసుకుంటూ పోస్ట్ లు వేశారు. కాగా కనక్ రెలే గుజరాత్‌లో జన్మించారు. 7 సంవత్సరాల వయస్సులోనే కథాకళి నృత్యం నేర్చుకోవడం ప్రారంభించారు. శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకుంటూనే.. UK నుండి అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో కూడా అర్హత సాధించారు.

అలాగే ముంబై విశ్వవిద్యాలయం నుండి నృత్యంలో డాక్టరేట్ పట్టా పొందారు. ఆ తరువాత పురాతన గ్రంథాల నుండి నృత్య రూపాలపై పరిశోధన చేసి మోహినియాట్టం శైలిని అభివృద్ధి చేశారు. ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ నృత్య జీవితంలో కనక్ రెలే.. పద్మశ్రీ, పద్మభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డు, కాళిదాస్ సమ్మాన్ మరియు MS సుబ్బులక్ష్మి అవార్డులు అందుకున్నారు.