Kajal Aggarwal: మాతృత్వం ఓ అద్భుతమైన అనుభూతి.. ప్రెగ్నెన్సీపై కాజల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నుండి కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు భార్యగా గత ఏడాది ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకొన్న ఈ జంటకి త్వరలోనే..

Kajal Aggarwal
Kajal Aggarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నుండి కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు భార్యగా గత ఏడాది ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకొన్న ఈ జంటకి త్వరలోనే ప్రమోషన్ ఖాయమని వార్తలు చెలరేగాయి. అదే కాజల్ ప్రస్తుతం గర్భవతి అని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. దీనిపై స్పందించిన కాజల్.. మాతృత్వం గురించి గొప్పగా చెప్పుకొచ్చింది.
Arjuna Phalguna: శ్రీవిష్ణు క్రేజీ టైటిల్స్.. ఫెయిల్యూర్ ఫాల్‌ఆన్‌కి బ్రేకేస్తాడా?
కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ ఎప్పుడో పెళ్లి చేసుకొని ఒక ఇంటిదయ్యిన సంగతి కూడా తెలిసిందే కాగా.. ప్రస్తుతం నిషా ఇద్దరి బిడ్డల తల్లి. దీనిపై వివరణ ఇచ్చిన కాజల్ ‘నా చెల్లెలు తల్లి అయ్యాక ఎంత పరిపూర్ణత్వాన్ని అనుభవిస్తున్నదో నా కళ్ళతో చూశాను. మాతృత్వం ఓ అద్భుతమైన అనుభూతి. ఆ దశలో ప్రతి స్త్రీ తనను తాను తెలుసుకుంటుంది. చెల్లి పిల్లలు ఇషాన్, కబీర్ సాన్నిహిత్యంలో నేను ఇప్పటికే మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పింది.
Samantha: లైఫ్ గురించి సామ్ చెప్పిన కొత్త నిర్వచనం.. పోస్ట్ వైరల్!
అంతేకాదు, కాజల్ పెంపుడు కుక్క మియా కూడా తనకు బిడ్డలాంటిదేనని.. అయితే, సొంత పిల్లలతో ఆ అనుభూతి రెట్టింపు కావచ్చని కాజల్ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీ అనే వార్తలలో నిజం లేదన్న చందమామ.. ఆ క్షణం వస్తే నేనే తప్పకుండా చెప్తానని.. ఆ క్షణం త్వరలోనే వస్తుందని కూడా చెప్పడం విశేషం.