Bollywood Releases: కదిలిన బాలీవుడ్.. ఒక్కొక్కరూ రిలీజ్ డేట్ అనౌన్స్!

ఒక్కొక్కరుగా బాలీవుడ్ బిగ్ స్టార్స్ డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా ఈ లిస్ట్ లోకి బాలీవుడ్ బాద్షా షారుఖ్ చేరారు. 2023 జనవరి 25న పఠాన్ రిలీజ్ అన్న గుడ్ న్యూస్ ను ఫ్యాన్స్..

Bollywood Releases: కదిలిన బాలీవుడ్.. ఒక్కొక్కరూ రిలీజ్ డేట్ అనౌన్స్!

Bollywood Releases

Updated On : March 3, 2022 / 4:27 PM IST

Bollywood Releases: ఒక్కొక్కరుగా బాలీవుడ్ బిగ్ స్టార్స్ డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా ఈ లిస్ట్ లోకి బాలీవుడ్ బాద్షా షారుఖ్ చేరారు. 2023 జనవరి 25న పఠాన్ రిలీజ్ అన్న గుడ్ న్యూస్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. షారుఖ్ తో పాటూ మిగిలిన బాలీవుడ్ హీరోలు వాళ్ల క్రేజీ ప్రాజెక్టులను ఎప్పుడెప్పుడు తీసుకు రాబోతున్నారో ఇప్పుడు చూద్దాం.

Bollywood Heroins: మారుతున్న రూలింగ్.. హీరోలకు పోటీ ఇస్తున్న హీరోయిన్లు

2023 జనవరి 25న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది పఠాన్. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్ చూపించబోతున్నాడు షారుఖ్ ఖాన్. వార్ ఫేం సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో షారుఖ్ తో పాటూ దీపికా పదుకునే, జాన్ అబ్రహం నటిస్తున్నారు. సల్మాన్ గెస్ట్ అప్పీరియెన్స్ ఇవ్వబోతున్నాడు. ఎప్పడినుంచో సినిమాపై ఫుల్ గా హైప్ క్రియేటవుతున్నా.. కొవిడ్ ఎఫెక్ట్ తో షూటింగ్ లేటయింది. మధ్యలో ఆర్యన్ ఖాన్ కేసుతో కూడా షూటింగ్ కి దూరమయ్యాడు షారుఖ్. మొత్తానికి ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రకటించి ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు.

Bollywood Love Affairs: మళ్ళీ పెళ్లి.. రెండోసారి పెళ్లి పీటలెక్కుతున్న సెలబ్రిటీస్!

సూపర్ 30 తర్వాత హృతిక్ రోషన్ కనిపించేది విక్రమ్ వేదా మూవీలో. హృతిక్, సైఫ్ కాంబోలో సెప్టెంబర్ 30న విక్రమ్ వేదా రిలీజ్ కాబోతుంది. సిద్ధార్ద్ ఆనంద్ డైరెక్షన్ లో హృతిక్ నటిస్తోన్న ఫైటర్ 2023 జనవరి 26 అన్నారు కానీ షారుఖ్ పఠాన్ ని జనవరి 25న ప్రకటించి ఇన్ డైరెక్ట్ గా ఫైటర్ పోస్ట్ పన్ అని చెప్పేశాడు డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్.

Bollywood Heroins: రెమ్యునరేషన్ డిమాండ్.. చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్!

ఆమీర్ ఖాన్ లాల్ సింగ చద్దా మూవీ ఏప్రిల్ 14 నుంచి తప్పుకుని ఆగస్ట్ 11న థియేటర్స్ కి రాబోతుంది. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో నాగచైతన్య ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఆమీర్ కూడా సినిమా హాళ్లో బొమ్మ చూపించి చాలా కాలమే అవుతోంది. ఫ్రెంచ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్ గా వస్తోన్న ఈ మూవీలో సల్మాన్, షారుఖ్ ఇద్దరూ తళుక్కున మెరవబోతున్నారు. ఇక సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న కభీ ఈద్ కభీ దివాళి 2023 ఈద్ పండక్కి డేట్ ఫిక్స్ చేసుకుంది.