Mrunal Thakur : అవార్డుల వేడుకలో మృణాల్‌కి చేదు అనుభవం.. నెపోటిజంపై వైరల్ కామెంట్స్..
ఇటీవల బాలీవుడ్ లో జరిగిన ఓ అవార్డుల వేడుకలో మృణాల్ ఠాకూర్ కి చేదు అనుభవం ఎదురైంది.

Mrunal Thakur shares her bitter experience about nepotism in bollywood
Mrunal Thakur : బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్.. తెలుగులో వరుస హిట్స్ అందుకుంటూ ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంటున్నారు. కాగా ఈ హీరోయిన్ కి ఇండస్ట్రీలో ఎంటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. నటన మీద ఇంటరెస్ట్ తో ఇండస్ట్రీకి వచ్చి.. తన టాలెంట్ తో బుల్లితెర నుంచి వెండితెర వరకు అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతూ వచ్చారు.
ఇక ఇటీవల బాలీవుడ్ లో జరిగిన ఓ అవార్డుల వేడుకలో తనకి ఎదురైన చేదు అనుభవాన్ని మృణాల్.. అందరితో పంచుకున్నారు. ఆ అవార్డుల వేడుకలో మృణాల్ ఠాకూర్ దగ్గర కొందరు మీడియా ప్రతినిథులు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. అయితే ఇంతలో ఒక స్టార్ కి సంబంధించిన వారసుడు అక్కడికి వచ్చాడు. దీంతో మీడియా వాళ్ళు మృణాల్ తో ఇంటర్వ్యూని మధ్యలో ఆపేసి.. ఆ స్టార్ కిడ్ దగ్గరకి పరుగులు పెట్టారు.
Also read : Rajamouli : మరోసారి రాజమౌళి వర్క్ గురించి మాట్లాడిన జేమ్స్ కామెరాన్..
ఈ విషయాన్ని తెలియజేస్తూనే.. మృణాల్ నెపోటిజం పై వైరల్ కామెంట్స్ చేశారు. “ప్రతి ఒక్కరు నెపోటిజం విషయంలో స్టార్ కిడ్స్ ని నిందిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. నెపోటిజం అనేది స్టార్ కిడ్స్ తప్పు కాదు. ప్రతి ఒక్క ఆడియెన్ స్టార్ కిడ్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. దీంతో మీడియా కూడా ఆ వార్తలనే రాయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటుంది” అంటూ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మృణాల్ చాలా కరెక్ట్ గా చెప్పిందంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కాగా గతంలో హీరో నాని కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. “చిరంజీవి కొడుకు సినిమా రిలీజ్ అయితే.. వందలమంది ఆడియన్స్ ఆ సినిమా చూడడానికి వెళ్తారు. కానీ ఆ సినిమాకి అంతమంది ప్రేక్షకులు రారు. అంటే ఇక్కడ నెపోటిజంని సపోర్ట్ చేస్తుంది ఆడియన్సే కదా. నెపోటిజం ఉన్నది ఇండస్ట్రీలోని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ హీరోల్లో కాదు. వారిని ఆదరిస్తున్న ఆడియన్స్‌లో” అంటూ పేర్కొన్నారు